పుట:Nutna Nibandana kathalu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు అతనికి దర్శనమిచ్చిన తీరూ, అతడు డమస్కులో యేసే మెస్సియా అని బహిరంగంగా బోధించిన తీరూ తెలియజేశాడు. సౌలు యెరూషలేములో కూడ యేసే మెస్సియా అని ధైర్యంగా ప్రకటించాడు. అక్కడి యూదులు కూడ సౌలుని చంపడానికి పూనుకొన్నారు.కనుక శిష్యులు అతన్ని సొంత నగరమైన తార్సుకి పంపివేశారు.

100. పేతురు తబితను జీవంతో లేపడం-అచ 9,3242

పేతురు చాల తావుల్లో బోధించి లిద్దా నగరానికి వచ్చాడు. అక్కడ ఎనియా అనే దీర్ఘకాల రోగికి ఆరోగ్యం చేకూర్చాడు. చాలమంది క్రీస్తుని విశ్వసించారు. ఆ ప్రక్కనే వున్న యొప్ప నగరంలో తబిత అనే భక్తురాలు చనిపోయింది. ఆమె జీవితకాలమంత పేదసాదలకు సహాయం చేసింది. అక్కడి వాళ్లు కబురు పెట్టగా పేతురు యొప్పనగరానికి వచ్చాడు. అతన్ని తబిత శవమున్న గదిలోకి తీసికొని పోయారు. ఆమె చుట్టు చాలమంది విలపిస్తున్నారు. ఆమె తమకు తయారుచేసి యిచ్చిన దుస్తులను కూడ పేతురుకి చూపించారు. అతడు అందరిని గదినుండి బయటికి పంపి ప్రార్థన చేసి తబిత లెమ్మనగానే ఆమె జీవంతో లేచింది. ఈ యద్భుత కార్యాన్ని చూచి చాలమంది ప్రభువుని విశ్వసించారు. 101. కొర్నెలి పరివర్తనం -అచ 10

101. కొర్నెలి పరివర్తనం -అచ 10

కైసరయ అనే పట్టణంలో కొర్నేలి అనే రోమను సైనికాధికారి వున్నాడు. అతడు యూదుల దేవుణ్ణి విశ్వసిస్తూ భక్తిగా జీవించేవాడు. ఒకరోజు దేవదూత అతనికి దర్శనమిచ్చి దేవుడు నీ పుణ్యకార్యాలను మెచ్చుకొన్నాడు. నీవు ಝೆಮ್ಲಿ) నగరంలో వున్న పేతురుని పిలిపించు అని చెప్పాడు. కొర్నేలి ఆలాగే యొప్పకు మనుష్యులను పంపాడు. అక్కడ పేతురు ఇంటిమీద ప్రార్ధన చేసికొంటూండగా ఓ దర్శనం కలిగింది. పెద్ద దుప్పటి తెరచుకొని భూమి మీదికి దిగివచ్చింది. దానిలో