పుట:Nutna Nibandana kathalu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధ్యాహ్నం నుండి మూడు గంటల వరకు చీకట్లు క్రమ్మకొన్నాయి. మూడుగంటల సమయాన యేసు నా దేవా! నీవు నన్నెండుకు విడనాడావని అరచాడు. ఆ పిమ్మట నాకుదాహం వేస్తుంది అన్నాడు. ఒక సైనికుడు అతనికి పులిసిన ద్రాక్షరసం అందించాడు. ఆ తర్వాత యేసు అంతా సమాప్తమైంది. తండ్రీ! నీ చేతుల్లోకి నా ఆత్మను సమర్పిస్తున్నాను అని పల్కి ప్రాణాలు విడిచాడు.

80. యేసు భూస్థాపనం - యోహా 19,31–42

యేసుచనిపోయింది శుక్రవారం సాయంత్రం. శనివారం పవిత్రమైన పాస్కపండుగవచ్చింది. కనుక శవాలను సిలువమీది నుండి వెంటనే దించాలనుకొన్నారు. అందుచే దొంగల కాళ్లు విరగొట్టి వాళ్లు త్వరగా చనిపోయేలా చేసి వారి శవాలను దించారు. క్రీస్తు దగ్గరికి వచ్చిచూడగా అతడు అప్పటికే చనిపోయి వున్నాడు. కనుక అతని కాళ్లు విరగగొట్టలేదు. ఒక సైనికుడు అతని ప్రక్కను బల్లెంతో పొడిచాడు. వెంటనే నెత్తూరు, నీరూ స్రవించాయి.

తర్వాత అరిమత్తయియా యోసేపూ నికొదేమూ క్రీస్తు దేహాన్ని సిలువమీది నుండి దించి పరిమళద్రవ్యాలు పూసి నారబట్టతోచుట్టిపెట్టారు. కపాల కొండకు దగ్గరలో యోసేఫకి ఓ తోటవుంది. దానిలో రాతిలో తొలిపించిన సమాధి వుంది. క్రీస్తు దేహాన్ని ఆ సమాధిలో వుంచి దాని ద్వారాన్ని బండతో మూసివేశారు. యూదులు పిలాతు అనుమతితో శిష్యులు వచ్చి క్రీస్తు దేహాన్ని దొంగిలించుకొనిపోకుండ వుండేలాగు, సమాధికి కాపలా పెట్టించారు. దాని ద్వారానికి ముద్ర కూడ వేశారు.

81. ప్రభువు ఉత్థానం - మత్త 28,1-15

ఆదివారం వేకువన ప్రభువు సమాధి నుండి సజీవుడై లేచాడు. మగ్గల మరియు, ఇతర పుణ్యస్త్రీలు క్రీస్తుదేహానికి లేపనం చేయడానికి