పుట:Nutna Nibandana kathalu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పొడుగున బట్టలుపరిచారు. మరికొందరు చెట్ల రెమ్మలునరికి త్రోవలో పడవేశారు. ప్రజలు దావీదు కుమారునికి జయం, ప్రభువు పేరిట వచ్చువానికి స్తుతులు అని అరచారు. ఈయన నజరేతు నుండి వచ్చిన ప్రవక్త అని చెప్పకొన్నారు. మెస్సీయా గాడిదనెక్కి వినయంగా వస్తాడని జెకర్యాప్రవక్త ముందుగానే చెప్పాడు. ఆ ప్రవచనం ఇప్పడు నెరవేరింది.

64. వివాహపు విందు - మత్త 22,1-21

క్రీస్తు తన బోధలు ఆలింపని యూదులను గూర్చి ఈ సామెత చెప్పాడు. ఒకరాజు తన కుమారుని పెండ్లి విందు సిద్ధం జేసి అతిథులకు కబురు పంపాడు. కాని వాళ్లు రాలేదు. ఎవరి పనిలో వాళ్లు మునిగి వున్నారు. పైగా రాజు పంపిన సేవకులను చంపివేశారు. రాజు కోపించి వారిని నాశం జేసి వారి పట్టణాన్ని తగలబెట్టించాడు. అటుపిమ్మట అతడు పేదసాదలను విందుకు పిలిపించాడు. విందుశాల నిండి పోయింది. వచ్చిన వారిలో ఒకడు తగిన ಬಟ್ಜಲು ధరించి రాలేదు. రాజు అతన్ని గెంటి వేయించాడు. యూదులు దైవరాజ్యాన్ని నిరాకరిస్తే నూత్నంగా వచ్చిన క్రైస్తవులు దాన్ని స్వీకరిస్తారని ఈ సామెత భావం.

65. సీజరుకి పన్ను - మత్త 22,15-22

పరిసయులకు క్రీస్తు బోధలు నచ్చలేదు. కనుక వాళ్లు అతన్ని ఇరకాటంలో పెట్టగోరి ఓ ప్రశ్న వేశారు. సీజరుకి పన్ను చెల్లించాలా వద్దా అని అడిగారు. చెల్లించమంటే యూదులకు కోపం. వద్దంటే రోమీయులకు కోపం. కనుక ఏలా జవాబు చెప్పినా అతడు చిక్కుల్లో పడతాడని వాళ్ల వ్యూహం. కాని క్రీస్తు ఒక నాణెం చూపించమన్నాడు. దాని మీద సీజరు బొమ్మ వుంది. కనుక ప్రభువు సీజరుకి చెల్లించేవి సీజరుకీ, దేవునికి చెల్లించేవి దేవునికీ చెల్లించండి అని చెప్పాడు. ఆ జవాబు వినగా విరోధులకు నోటమాట రాలేదు.


66. విధవ కానుక - మార్కు 12,41-44

ప్రభువు దేవాలయంలో కూర్చుండి అక్కడ ప్రజలు కానుకలు