పుట:Nutna Nibandana kathalu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎవరైన చూపు ఈయ గలరా? ఆ యేసు దేవుని వద్ద నుండి వచ్చినవాడు కాకపోతే ఈ పని ఏలా చేయగలిగాడు అని ప్రశ్నించాడు. పరిసయులు పాపంలో పుట్టిన నీవు మాకు బోధిస్తున్నావా అని అతన్ని వెలివేశారు. వాళ్లు చూపు రావడంలోని అద్భుతాన్ని పట్టించుకోలేదు. విశ్రాంతి దినాన పని చేయకూడదు అనే నియమాన్ని మీరినందుకు యేసుని తప్పపట్టారు.

తర్వాత యేసు ఆ గ్రుడ్డివానిని కలసికొని నీవు మనుష్యకుమారుని విశ్వసిస్తూన్నావా అని అడిగాడు. నమ్ముతున్నాను అని చెప్పి అతడు ప్రభువుని ఆరాధించాడు. యేసు నేను చూపు లేనివారికి చూపు ఈయడానికి వచ్చాను. మేము చూడగలం అనుకొనేవారికి చూపులేదని తెలియజేయడానికి కూడ వచ్చాను అని చెప్పాడు.


55. అవివేకియైన ధనికుడు - లూకా 12,13-21

ఒక పర్యాయం ఒకడు బోధకుడా! మా తండ్రి ఆస్తిని పంపిణీ చేయమని మీరు మా అన్నతో చెప్పండి అని క్రీస్తుని అడిగాడు. నరులు వస్తువ్యామోహంలో పడి దురాశకు లొంగకూడదు అనడానికి క్రీస్తు ఈ క్రింది సామెత చెప్పాడు. ఒక ధనవంతునికి పంటలు బాగా పండాయి. అతడు నా కొట్లు పడగొట్టించి ఇంకా పెద్దకొట్లు కట్టిస్తాను. నా ధాన్యమంతా వాటిలో నిల్వజేస్తాను. చాల కాలం తిని త్రాగి ఆనందిస్తాను అని తనలో తాను అనుకొన్నాడు. కాని దేవుడు ఓరీ అవివేకీ! ఈ రాత్రే నీవు చనిపోతావు సుమా! ఆ మీదట నీవు కూడబెట్టినవి ఎవరు అనుభవిస్తారు అన్నాడు. ఈ లోకంలో ధనం కూడబెట్టుకుంటే చాలదు, పరలోకంలో కూడబెట్టుకోవాలి.


56. కాయలు కాయని అంజూరం - లూకా 13,6-9

ప్రభువు కాయలు కాయని అంజూరం ఉపమానం చెప్పాడు. ఒక రైతు తన తోటలో అంజూరపు చెట్టు నాటించాడు. అది మూడేండ్లయినా కాయలు కాయలేదు. రైతు నిరాశ చెంది దాన్ని నరికివేయమని తోటమాలితో చెప్పడు. అతడు ఇంకో యేడు చూద్దాం.