పుట:Nutna Nibandana kathalu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవునికీ ద్రోహం చేశాను. ఇప్పడు నీ కుమారునిగా వుండదగను. సేవకుణ్ణిగా పెట్టుకో అని వేడుకొన్నాడు. కాని తండ్రి అతన్ని కౌగిలించుకొని ఆదరంతో స్వీకరించాడు. క్రొత్త బట్టలు తొడిగించి పెద్ద విందు చేశాడు. మరణించిన నా కుమారుడు మళ్లా బ్రతికాడు అనుకొని సంబరాలు పడ్డాడు. అంతలో పెద్ద కుమారుడు ఇంటికి వచ్చాడు. అతనికి ఈ విందు వినోదాలు నచ్చలేదు. ఆస్తి పాడుచేసి వచ్చిన కుమారునికి విందు జరపడమేమిటని కోపించాడు. కాని తండ్రి అతన్ని శాంతపరచి చనిపోయినవాడు మళ్లా బ్రతికినందుకు సంతోషిద్దాం అని చెప్పాడు. క్రీస్తు ఈ సామెత చెప్పి ఈ తండ్రిలాగే దేవుడు పాపుల పట్ల ఆదరం జూపుతాడని బోధించాడు.


54. పుట్టు గ్రుడ్డివానికి చూపు -యోహా 9

ఓ మారు క్రీస్తూ శిష్యులూ త్రోవన పోతూండగా ఓ పుట్టుగ్రుడ్డివాడు కన్పించాడు. శిష్యులు ఎవరి పాపం వలన ఇతడు గ్రుడ్డివాడయ్యాడు? ఇతని పాపం వల్లనా లేక తల్లిదండ్రుల పాపం వల్లనా అని అడిగారు. క్రీస్తు ఎవరి పాపంవల్లనా కాదు. ఇతని గ్రుడ్డితనం దేవునికి కీర్తి తెచ్చిపెడుతుంది అని చెప్పాడు. ఆ పిమ్మట ఉమ్మితో మట్టి కలిపి అతని కన్నులకు రాసి పోయి సిలోయము కొనేటిలో కడుగుకొమ్మని చెప్పాడు. అతడు ఆలాగే కడుగుకోగా చూపు వచ్చింది. జనం విస్తుపోయి అతన్ని పరిసయుల వద్దకు కొనిపోయారు. యేసు విశ్రాంతి దినాన ఆ యద్భుతాన్ని చేసినందున వాళ్లు అతన్ని తప్పపట్టారు. పైగా అతడు పుట గ్రుడ్డివాడు అని నమ్మక అతని తల్లిదండ్రులను పిలిపించారు. వాళ్లు అతడేమో పుట్టుగ్రుడ్లే. కాని చూపు ఎలా వచ్చిందో మాకు తెలియదు. మీరు అతన్నే అడగండి అని తప్పకొన్నారు. పరిసయులు గ్రుడ్డివాణ్ణి మళ్లా ప్రశ్నించారు. అతడు పుట్టుగ్రుడ్డికి