పుట:Nutna Nibandana kathalu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని గొణుగుకొన్నారు. జక్కయ పన్నులు వసూలుచేయడంలో మోసాలు చేసేవాడు. కాని ప్రభువు సాన్నిధ్యం వలన అతనికి పశ్చాత్తాపం పుట్టింది. కనుక క్రీస్తుతో నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చివేస్తాను. నేను ఎవరినైన మోసగించి నట్లయితే నాలు వంతులు నష్టపరిహారం చేస్తాను అన్నాడు. క్రీస్తు సంతోషించి ఈరోజు ఈ కుటుంబానికి రక్షణం లభించింది. మనుష్య కుమారుడు పాపులను రక్షించడానికే వచ్చాడు అని పల్కాడు.

49. బర్తిమయికి చూపు - మార్కు 10,46-52

ప్రభువు యెరికో పట్టణానికి వస్తున్నాడు. దారిలో బర్తిమయి అనే బిచ్చగాడు త్రోవ ప్రక్కన కూర్చుండి బిచ్చం అడుగుకొంటున్నాడు. అతడు ప్రభువు ఆ దారినే వస్తున్నాడని విని అయ్యా! నన్ను కరుణించు అని అరచాడు. చుట్టుపట్ల వున్న జనం నీ నోరు మూయమని దబాయించారు. ప్రభువు అతన్ని తన దగ్గరికి రమ్మని పిల్చి నీకు ఏమి కావాలని అడిగాడు. బిచ్చగాడు నాకు చూపు దయచేయి అని వేడుకొన్నాడు. ప్రభువు నీ విశ్వాసమే నీకు ఆరోగ్యాన్ని చేకూర్చింది అన్నాడు. వెంటనే అతడు చూపుని పొంది క్రీస్తు వెంట పోయాడు.

50. మరియా మార్తలు - లూకా 10,38–42

యేసు బెతానియా గ్రామంలోని మరియూ మార్తల యింటికి వచ్చాడు. మార్త ప్రభువుకి మంచి భోజనం తయారుచేయడానికి పూనుకొంది. కాని మరియు ప్రభువు పాదాల దగ్గర కూర్చుండి అతని బోధలు వింటూంది. మార్త వంటపనులన్నీ నా నెత్తిన పడ్డాయి. చెల్లెలిని గూడ వచ్చి సహాయం చేయమని చెప్పండి అని అడిగింది. కాని ప్రభువు మార్తా! నీవు చాల పనులతో సతమతం ఔతున్నావు. పరలోకంలోని తండ్రిని గూర్చి వినడం ముఖ్యం. మరియు ఆ పని చేస్తూంది. ఆమె ఆలాగే వింటూ వుంటంది అని చెప్పాడు. భక్తుడు రోజూ కాసేపు బైబులు ముందు కూర్చుండి ఆ గ్రంథం నుండి ప్రభువుబోధలు వింటూండాలి.