పుట:Nutna Nibandana kathalu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చి ఆరోగ్యాన్ని పొందండి. విశ్రాంతి దినాన కాదు అన్నాడు. కాని ప్రభువు విశ్రాంతి దినాన మీ పశువులను నీళ్లు పెట్టడానికి తోలుకొని పోతున్నారు కదా! ఇన్ని యేండ్లనుండి బాధపడుతున్న ఈమెను విశ్రాంతి దినాన వ్యాధి బంధాల నుండి విడిపిస్తే తప్పేమిటి అన్నాడు. అక్కడివాళ్లు ఆ యద్భుతాన్ని చూచి సంతోషించారు.

47.మంచి సమయరయుడు -లూకా 18

అక్కరలో వున్నవారికి సహాయం చేయాలని చెపూ క్రీస్తు ఈ సామెత చెప్పాడు. ఒక యూదుడు యెరికోకు వెళూండగా దొంగలు వాణ్ణి చితకబాది దోచుకొని కొనవూపిరితో వదలి వెళ్లారు. ఓ యాజకుడు ఆ దారిన పోతూ అతన్ని చూచికూడ పట్టించుకోకుండ వెళ్లిపోయాడు. ఆలాగే ఓ లేవీయుడు కూడ ఆ దారిన వెళూ పట్టించుకోకుండ ప్రక్కకు తొలగిపోయాడు. అటుపిమ్మట ఓ సమరయుడు ఆ త్రోవ వెంటవచ్చి అతన్ని చూచి జాలి పడ్డాడు. అతని గాయాలకు కట్టుకట్టి సత్రానికి తీసికొని పోయాడు. సత్రం యజమానునికి డబ్బు చెల్లించి నీవు ఇతన్ని పరామర్శించు. ఎక్కువ డబ్బు అసరమైతే నేను మళ్లా వచ్చినప్పుడు చెల్లిస్తాను అని చెప్పాడు. ఈ సమరయునిలాగే మనం కూడ ఆపదలో వున్నవారిని ఆదుకోవాలి.

48. జక్కయ - లూకా 19,1-10

యేసు యెరికో నగరానికి వచ్చాడు. అక్కడ జక్కయ అనే సుంకరుల నాయకుడు వున్నాడు. అతనికి యేసుని కన్నులార చూడాలనే కోరిక పుట్టింది. కాని పొట్టివాడుకావడంచే పెద్ద గుంపు మధ్యలో వున్న క్రీస్తుని చూడలేక పోయాడు. కనుక అక్కడవున్న ఓ మేడిచెట్టు నెక్కాడు. ప్రభువు అక్కడికి వచ్చి జక్కయా! త్వరగా దిగిరా. నేను మీ యింటికి అతిధిగా వస్తాను అన్నాడు. జక్కయ సంబరంతో ప్రభువుని ఆహ్వానించాడు. కాని చుట్టుపట్ల వున్న జనం ఈయన ఈ పాపాత్ముని యింటికే వెళ్లాలా