పుట:Nutna Nibandana kathalu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధికారం నెరపేవాడు గొప్పవాడు అనుకొన్నారు. క్రీస్తు పసికందులాగ వినయంగా వుండేవాడు, ఇతరులకు సేవలు చేసే వాడు గొప్పవాడు అని చెప్పాడు. వాళ్లు పాఠం నేర్చుకొన్నారు.


44. చిన్నబిడ్డలను దీవించడం - మార్కు 10,13-16

ఒక పర్యాయం తల్లులు బిడ్డలను క్రీస్తు దగ్గరికి తీసికొని వచ్చి వారిని దీవించమని అడిగారు. కొని శిష్యులు వారిని ప్రక్కకు నెట్టారు. ప్రభువు శిష్యులను మందలించి పసిబిడ్డలను నా చెంతకు రానీయండి. ఈ పిల్లల్లాంటి వారికే దైవరాజ్యం దక్కుతుంది. పసిబిడ్డల మనస్తత్వం అలవర్చుకొంటే గాని నరులు దైవరాజ్యంలో ప్రవేశించలేరు అని చెప్పాడు. అటుపిమ్మట ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారిని దీవించాడు. 45. తోడివారిని క్షమించాలి -మత్త 18,21-34 ఒకరాజుకి ఒక సేవకుడు పెద్దమొత్తం అప్పపడివున్నాడు. కాని అతడు బాకీ చెల్లించలేని పరిస్థితిలో వున్నాడు. రాజు జాలిపడి అతని అప్పంతా క్షమించాడు. ఈ సేవకునికి మరో సేవకుడు కొద్దిమొత్తం బాకీ పడివున్నాడు. అతడు కూడ బాకీ చెల్లించలేని పరిస్థితిలోనే వున్నాడు. ఐనా ఇతడు దయలేక, అప్ప తీర్చనందుకు అతన్నిచెరలో త్రోయించాడు. రాజుకి ఈ సంగతి తెలిసింది. అతడు మొదటి సేవకునిపై మండిపడి నేను నిన్ను క్షమించినట్లే నీవు కూడ నీ పొరుగువాడ్డి క్షమించాలి కదా అన్నాడు. అతన్ని శిక్షించడానికి తలారులకు అప్పగించాడు. క్రీస్తు ఈ సామెత చెప్పి ఒకరి అపరాధాలను ఒకరు క్షమించాలని బోధించాడు.


46. నడుము వంగిన స్త్రీ - లూకా 13, 10-17

యేసు విశ్రాంతి దినాన ప్రార్థనా మందిరంలో బోధిస్తున్నాడు. 18 ఏండ్ల నుండి రోగియై నడుము వంగిపోయివున్న ఓ స్త్రీ అక్కడికి వచ్చింది. ప్రభువు ఆమె వ్యాధిని కుదర్చగా తిన్నగా నిలబడింది. ప్రార్థనా మందిరాధికారికి యేసు విశ్రాంతి దినాన అద్భుతం చేయడం నచ్చలేదు. అతడు పనిచేయడానికి వారంలో అయిదు రోజులు వున్నాయి కదా! ఆ రోజుల్లో