పుట:Nutna Nibandana kathalu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని కేకలు వేశాడు. యేసు అతని చేయి పట్టుకొని నీకు చాలినంత విశ్వాసం లేదు. నీవు ఎందుకు సందేహించావు అని అడిగాడు. ఆ మీదట ఇద్దరూ పడవనెక్కగా గాలి ఆగిపోయింది. శిష్యులు నీవు దేవుని కుమారుడవు అని పల్కి క్రీస్తుకి మొక్కారు.

39. కనానీయ స్త్రీ విశ్వాసం -మత్త 15,21-28


యేసు అన్యజాతి ప్రజలు వసించే తూరు, సీదోను ప్రాంతాలకు వెళ్లాడు. అక్కడో కనానీయ స్త్రీ అతని దగ్గరికి వచ్చి అయ్యా! నా కొమార్తెను దయ్యంపట్టి పీడిస్తూంది. ఆమెను బాగుచేయి అని వేడుకొంది. ప్రభువు సమాధానం చెప్పలేదు. శిష్యులు ఆమెను గురువుకి సిఫార్సు చేశారు. అతడు పిల్లలు తినే రొట్టెలను కుక్కపిల్లలకు వేస్తామా అని జవాబిచ్చాడు. అనగా నేను యూదులకు సహాయం చేయడానికి వచ్చాను గాని అన్యజాతి వారికి కాదు అని క్రీస్తు భావం. ఆ స్త్రీ తన్ను కుక్కతో పోల్చినందుకు ఏ మాత్రం బాధపడలేదు. అయ్యా యజమానుని బల్లమీది నుండి జారిపడిన రొట్టెముక్కలను కుక్కపిల్లలు కూడ తింటాయి కదా అంది. ప్రభువు ఆమె వినయాన్ని మెచ్చుకొని 急 విశ్వాసం గొప్పది అన్నాడు. ఆ క్షణమే ఆమె బిడ్డకు ఆరోగ్యం చేకూరింది.

40. పేతురుకు ప్రధానాధికారం -మత్త 16,13-20

యేసు శిష్యులతో ప్రయాణం చేస్తూ కైసరయూ ఫిలిప్పి ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ప్రజలు మనుష్యకుమారుడు ఎవరని చెప్పకొంటున్నారు అని శిష్యులను అడిగాడు. వాళ్లు యోహాను లేక ఏలీయా లేక యిర్మీయా అని వాకొంటున్నారు అని చెప్పారు. మరి మీ దృష్టిలో నేనెవరిని అని క్రీస్తు మళ్లా అడిగాడు. పేతురు శిష్యుల తరఫున జవాబు చెపూ అయ్యా! నీవు మెస్సీయావి అన్నాడు. ప్రభువు సంతోషించి సీమోనూ! నీవు ధన్యుడివి. పరలోకంలోని తండ్రే నీకీ విషయం తెలియజేశాడు. నీ పేరు పేతురు లేక రాయి. ఈ రాతిమీద నా సమాజాన్ని నిర్మిస్తాను. నరక