పుట:Nutna Nibandana kathalu.pdf/2

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిమనవిమాట

పూర్వనిబంధన కథలను ఇదివరకే ప్రచురించాం. ఈ పుస్తకం దానికి అనుసరణం. ఈ గ్రంథం ప్రధానంగా పిల్లలకు నూత్న నిబంధన జ్ఞానాన్ని అలవర్చడానికి ఉద్దేశింపబడింది. ఐనా యిది పెద్దలకు కూడ ఉపయోగ పడుతుంది.

ప్రతి కథకు ఆలోకనం ఇచ్చాం. ఒక్కో కథ చదివిన తర్వాత నూత్న నిబంధనం నుండి కూడ ఆలోకనాన్ని నేరుగా చదువుకోవాలి. దీని వలన బైబులు జ్ఞానం అలవడుతుంది.

ఈ కథలను వట్టినే చదువుకొనిపోతే చాలదు. ఇవి బోధించే నీతులను జీవితంలో పాటించాలి. బైబులు మంచి ప్రవర్తనను నేర్పే గ్రంథం.

ఈ పుస్తకం మన ప్రజల్లో బైబులు జ్ఞానాన్ని కొలదిగానైనా పెంచుతుందని ఆశిస్తున్నాం. ఈ గ్రంథ ముద్రణకు ఆర్థిక సహాయాన్ని అందించిన రెవ.డోక్టరు ఇంజే పౌలు గారికి మా కృతజ్ఞతలు.


- గ్రంథకర్త