పుట:Nutna Nibandana kathalu.pdf/11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నడికట్టుగా ధరించాడు. ఎడారిలో వసిస్తూ మిడతలూ, పుట్టతేనే భుజించాడు. యోర్గాను నదిలో ప్రజలకు జ్ఞానస్నానం ఇచ్చాడు. మీరు మేము అబ్రాహాము సంతానానిమి, మాకు రక్షణం తప్పకుండా లభిస్తుంది అని ధీమాగా వుండి పోకండి. మంచిపండ్లను ఈయని ప్రతిచెట్టుని నరికి అగ్నిలో పడవేస్తారు. కనుక మీ పాపాలకు పశ్చాత్తాప పడండి అని ప్రజలను హెచ్చరించాడు. ప్రజలు నీవు మెస్సియావా అని ప్రశ్నింపగా యోహాను నేను మెస్సియాను కాను, ఏలీయాను కాను, అంత్య దినాల్లో వచ్చే ప్రవక్తను కూడ కాను. ప్రభువుకి మార్గం సిద్ధం చేయండి అని యెడారిలో విన్పించే స్వరాన్ని మాత్రమే. మెస్సీయా రాకడకు జనాన్ని సిద్ధం చేయడం నా పని. నేను మీకు నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నాను. నా తర్వాత వచ్చే మెస్సీయా మీకు పవిత్రాత్మతో జ్ఞానస్నానం ఇస్తాడు. నేను అతని పాదరక్షల వారు విప్పడానికి కూడ యోగ్యుణ్ణి కాను అని చెప్పాడు. ఈ విధంగా యోహాను ముందుగానే క్రీస్తుని ప్రజలకు పరిచయం జేశాడు.


12. క్రీస్తు జ్ఞానస్నానం, శోధనలు - మత్త 3,13-4,11

క్రీస్తు యోర్దాను నదికి వెళ్లి యోహాను నుండి జ్ఞానస్నానం పొందాడు. అప్పడు పవిత్రాత్మ పావురంలాగ అతని మీదికి దిగివచ్చింది. తండ్రి ఇతడు నాకు ప్రీతి కలిగించే కుమారుడు. నేను ఇతన్ని తలంచుకొని ఆనంది స్తున్నాను అని సాక్ష్యం పలికాడు.

అటుతర్వాత ఆత్మ అతన్ని యెడారికి కొనిపోయింది. అక్కడ నలభై రోజులు ఉపవాసం చేశాక పిశాచం అతన్ని శోధించింది. అది నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చి భుజించు అంది. నరుడు రొట్టెతోనే గాక దేవుని వాక్కువలన గూడ జీవిస్తాడు అని యేసు సమాధానం చెప్పాడు. ఇది మొదటి శోధనం.

మళ్లా పిశాచం అతన్ని దేవాలయం శిఖరం మీద కూర్చోబెట్టి నీవు దేవుని కుమారుడవైతే పోస్త్ర క్రిందికి దూకు. దేవదూతలు