పుట:Nkiminku Kuduru (Ayurvedam).djvu/6

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


తొ లి ప లు కు

    శ్రీమధజ్జారాదిభట్ల నారాయణదాసుగారు, వేదములు, స్మృతులు అష్టాదశ పురాణములు పరిశీలించి, ఆయుర్వేఅము గురించి వ్రాయబదినవిషయములు సేకరించి అచ్చతెనుగులో 'మన్కిమిన్కు ' యను పేరుతో రోగలక్షణములగురించి, రోగసికిత్సగురించి, మందులు తయారుచేయుటకు యుపయేగించు ఓషదులు గురించి యొక పెద్ద గ్రంధము రచించినారు. అందులో నొక భాగమైన 'కుదురు ' ప్రచురించగలిగితిమి. 'కుదురు ' యను యీ గ్రంధములో, అధర్వసంహిత, తైత్తరీయారణ్యకము, ఋగ్వేదము, ఐతరేయ బ్రాహ్మణము. చాందోగ్యోపనిషత్తు మొదలగు వాటిలో నాయుర్వేదము గురించి చెప్పబడిన విషయములన్నియు వివరించబడినవి.
     ఈ గ్రంధము ప్రచురించుతకు రెందుకారణము లున్నవి. ఆయుర్వేదము గురించి పరిశీలన చేయువారికి యీ గ్రంధము చాలా యుప యోగించును. అచ్చ తెలుగు మాటలు వాటియర్ధము  తెలుసుకొనువారికి యీ గ్రంధము చాలా సహకారిగా  నుండును. అచ్చతెలుగు మాటలు వాడుక చాలా తగ్గి పోవుచున్నది. నన్నయ, తిక్కన, మొదలగువారి రచనలలో యెన్నియొ అచ్చతెలుగు మాటలు కాన్పించును. వారందదు, యెన్నియె అచ్చతెలుగు పదములు ప్రయోగించినను, కెవలము అచ్చతెలుగులో యేగ్రంధము వ్రాసియుండలేదు. కాని నారాయణదాసు గారు కేవలము అచ్చ తెలుగులో చాలా రచనలు సాగించినారు. తెలుగు మాటలకు తెలుగులోనే అర్ధములు వ్రాయుచు 'సీమ పల్కువహి ' యనుయను పేరుతో నొక నిఘంటువు కూర్చినారు. సీమపల్కునహి: మన్కిమిన్కు, రామచంద్రశతకము, కాశీశతకము, లలితాసహస్ర నామము మొదలగు అముద్రిత గ్రంధముల నొసంగినారు. ఆద్రవ్యముతో, రామచంద్రశతకము కాశీశతకము ప్రచురణచేయబడినవి. మన్కిమిన్కులో నొకభాగము 'కుదురు ' ప్రచురించగలిగితిమి. సీమపల్కువహిలో కొంతభాగము మాత్రము అచ్చువేయట జరిగినది. మన్కి మిన్కులో మిగిలినభాగము అచ్చువేయుటకు సీమపల్కువహి పూర్తిచేయుటకు, యితర అముద్రిత గ్రంధములు ప్రచురించుటకు పదిపన్నేండు వేల రూపాయలు కావలసియున్నది.
    ప్రభుత్వమువారు, ధనవంతులు, విద్యావంతులు, ఉదారస్వభావులు భూరి విరాళముల నొసంగి మా యుద్యమము జయప్రదముగావించమని వినయపూర్వకముగా మనవిచేయుచున్నాను.

వసంతనికేతనము

పనీరువీధి, విజయనగరం

25-3-61

వసంతరావు బ్రహ్మాజీరావు,

కార్యదర్శి.

శ్రీ ఆదిభట్ల నారాయణదాసు అముద్రిత

గ్రంధప్రచురణ సంఘము