పుట:Nilagiri yathra.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అవతారిక.

వచనము - ఈ ధాత్రి నీలగోత్ర యాత్రాపరులగు నరుల కత్యంతోపయుక్తం బును స్వదేశ భాషాభ్యాస లోలురగు బాలుర కనవధిక వాచక వైభవోన్మేష కరంబును - సమధిగత శాస్త్ర లక్షణ విచక్షణ శిక్షితంబును నగు నీ గ్రంథంబునం బథంబునం గల యయ్యయి సంవసథంబుల యవితథస్థితులును సకలజన సంసేవ్య భవ్య దివ్యస్థల మహా మహిమలును గొందఱ కమందానందాశ్చర్యకర సౌకర్యంబులగు కొన్ని కార్యంబులును గానంబడు.