పుట:Niganttu Cheritramu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిఘంటుచరిత్రము.

శ్రీమాన్ మేడేపల్లి వేంకటరమణాచార్యులుగారు, విజయనగరము.


సంస్కృతభాషలో మిక్కిలి ప్రాచీన మైనదియు నిప్పటికిని వాడుకలో నున్నదియు నగునిఘంటువు వైదికనిఘంటువు. దానికి యాస్కుఁ డనునొక మహర్షి యొక వ్యాఖ్యానమును రచించెను. వేదములయందుఁ బ్రయోగింపఁబడిన సకలసుబంతపదములు త్రిజన్తపదములు దానియందుఁ బూర్ణముగా సంగ్రహింపఁబడినవి. ప్రాయికముగా నీనిరుక్తమువంటి మఱికొన్ని గ్రంథములు పూర్వకాలమం దుండవచ్చును. కాని యవి యన్నియు నిటీవల నంతరించినవి. ఈ నిరుక్తమందుఁ గర్తృకర్మక్రియలు లేకుండ వేదశబ్దము లన్నియు గుంపులుగుంపులుగా నొకచోటఁ జేర్పఁబడినవి. ఇది యయిదధ్యాయములుగా విభజింపఁబడి యున్నది. వానిలో మొదటిమూఁడధ్యాయములలోను నామవాచకములకుఁ దిజన్తములకుఁ బర్యాయపదగుచ్చము లేర్పడియున్నవి. ప్రకరణసందర్భమునుబట్టి యర్జనిర్ధారణముఁ జేయఁదగిన నిష్పన్నశబ్దములపట్టికలు కలవు. పంచమాధ్యాయమందు నానావిధదేవతలనామము లున్నవి. ఈ గ్రంథమును రచించినవాఁ డెవ్వఁడో యెవనికిఁ దెలియదు. యాాస్కుఁ డీనిరుక్తమను వ్యాఖ్యానమును వ్రాయుకాలమునకే యీ వైదికనిఘంటువు వ్యవహారములో నున్నది. వేదాధ్యయనము నారంభించిన వారు దీనిని వాచోవిధేయముగాఁ జేసికొనుటకు వల్లించుచుండిరి. అందువలన దీని కామ్నాయ మని పేరు కలిగినది. “సమామ్నాయ స్సమామ్నాతః సవ్యాఖ్యాతవ్యః । తమిమం సమామ్నాయం నిఘంటవ ఇత్యాచక్షతే (నిరు 1. 1. 1) సాక్షాత్కృత ధర్మాణః ఋషయో బభూవుస్తే సాక్షాత్కృత ధర్మస్య ఉపదేశేన మంత్రా న్సంప్రాహురుపదేశాయ । గ్లాయంతోవరెే బిల్మగ్రహణాయ ఇమం గ్రంథం సమామ్నాయిషు వేదంచ వేదాంగానిచ (నిరు. 1-6-5) బిల్మం బిల్మం భాషణమితి నైరుక్తాః (పాణినిచే నిరస్తులైన యనేక వైయాకరణులను యాాస్కుఁడు తన గ్రంథమందుఁ జెప్పినను పాణిని పేరెత్తకపోవుటచే యాాస్కుఁడు పాణినికంటెఁ బ్రాచీనుఁడని తలంపఁబడు చున్నాఁడు. పాణిని యాాస్కఁ శబ్దనిరూపణమువిషయమై తన అష్టాధ్యాయిలో “యస్కాదిభ్యోగోత్రే " 11-4-65) అని వ్రాసియుండుటచేఁ బాణిని యాాస్కుని