పుట:Niganttu Cheritramu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నిఘంటు చరిత్రము .

మాధవుఁడు వ్రాసిన వేద వ్యాఖ్యానమును గాని దుర్గాచార్యుఁడు నిరుక్తమునకు వ్రాసిన వ్యాఖ్యానమును గాని చూచియున్నట్లు కానరాదు. ఈనిరుక్తములో ననేక గ్రంథకర్తలను బేరొనియున్నాడు . * స్కందస్వామి కృతాం నిరుక్తిటీకాం స్కందస్వామిభవ త్స్వామి రాహదేవ శ్రీనివాసమాధవసేవ ఉప్పటభట్ట భాస్కరమిశ్ర భరతస్వామ్యాది విరచితాని వేద భాష్యాణి పాణినీయం వ్యాకరణం విశేషత సద్వృత్తిం క్షీరస్వామ్యనంతాచార్యకృతాం నిఘంటువ్యాఖ్యాం భోజరాజీయం వ్యాకరణం కమలనయనీయనిఖిలపదసంస్కారాంశ్చ నిరీక్ష్య క్రియతే. (నిరు. 3-1-14)

దుర్గాచార్యుఁడు నిరుక్తమున కెపుడు వ్యాఖ్యానము వ్రాసెనో తెలియదు, గ్రంథాంతగద్యమందు 'ఇతి శ్రీ జంబూమార్గాశ్రమవాసిన ఆచార్య భగవద్దుర్గన్య కృతౌ ఏకాదశోధ్యాయ స్సమాప్తః” అని యున్నది. ప్రాయికముగా నితఁడు దేవరాజునకు శాయణాచార్యునకు మధ్య కాలమందున్న వాఁడు కావచ్చును. ఈనిరుక్తమునకు స్కందస్వామి యొకవ్యాఖ్యానమును, ఉగ్రుఁడనువాఁడొక వ్యాఖ్యానమును వ్రాసిరని దేవరాజు చెప్పుచున్నాఁడు.

అమరునికంటే ముందున్న నిఘంటుకర్తలు:- సర్వానందుఁడు అమరము ప్రథమకాండ ప్రథమవర్గమును వ్యాఖ్యానము చేయుచు నిట్లు వ్రాసెను. “అమరుఁడు వ్యాఢివరరుచులు రచించిన కోశములఁ జూచి తన సోమలింగానుశాసనమును వ్రాసెను. తిృకాండశేషము ఉత్పలినీనిఘంటువు, పర్యాయపదములనే ప్రతిపాదించుచున్నది. వ్యాఢివరరుచి కోశములు మఱికొన్ని నిఘంటువులు శబ్దములలింగములను గూడఁ దెలుపుచున్నవి' (అన్యంతంత్రాణి వ్యాఢివరరుచి ప్రభృతీనాం తంత్రాణి సమాహృత్య ఏకీకృత్య అతఏవ సమ్పూర్ణ మిదమ్. యత స్త్రీకాండోత్పలిన్యాదీని నామమాత్రతంత్రాణి- వ్యాఢివరరుచ్యాది ప్రణీతాని తులింగమాత్ర తంత్రాణి (సర్వానంద పే-2-1-15)" (రత్నకోశము మొదలగు నిఘంటువులవలె సమరసింహుఁడు కూడ లింగములను బట్టి యేల రచింపలేదని సర్వానందుఁ డమరసింహుని 1-1-4 శ్లోకమునకు వ్రాసిన వ్యాఖ్యానము లోనిట్లడుగుచున్నాడు. (ననురత్న కోశాదివత్ స్త్రీపుంసపుంసకకాండ విధానేనైవ వచనము చితమ్) క్షీరస్వామి ఆమరద్వితీయ కాండములో 95 వ శ్లోకమునకు వ్యాఖ్యానము వ్రాయుచు "బృహతీ తు నిదీగ్ధకా” అను భాగురిపాఠమును జూచి గ్రంథకర్త భ్రాంతినొందె ననియు, “ఏతచ్చ ద్రప్సం శరమితి” భాగురి