పుట:Niganttu Cheritramu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిఘంటుచరిత్రము.

5

అనియు శ్రుతులే యీ వేదమీశ్వరునివలన నుత్పన్నమైనదని చెప్పుచుండుటవలన నిదియుఁ గాళిదాసాదికృతకావ్యములవలెనే పౌరుషేయమే. అందుచే తనే బాదరాయణుఁడు “శాస్త్రయోనిత్త్వాత్” అనుసూత్రముచే వేదమీశ్వరకర్తృక మని నుడివెను.” అని పలికెద వేమో దీనికి సమాధానమును జెప్పెద వినుము. “వాచా విరూపనిత్యయా” “అనాదినిధనా నిత్యా వా గుత్స్యష్టా స్వయంభువా" ఇత్యాది శ్రుతి స్మృతులే వేదము నిత్యమని చెప్పుచున్నవి. వేదవ్యాసుడు దేవతాధికరణమందు “అత ఏవ చ నిత్యత్వమ్" (1. అ, 3-29 సూ) అనుసూత్రముచే వేదనిత్యత్వమును సమర్థించియున్నాడు. “యక్లీన వాచః పదవీయ మాయన్ తొ మన్వందన్ ఋషిషు ప్రవిష్టాం” అను మంత్రవర్ణ మిందుకుఁ బ్రమాణము. “యుగాన్తే న్తహి౯హతాన్వెేదా౯ సేతిహ సాన్మహష౯యః! లేభిరే తపసా పూర్వ మనుజ్ఞాతా స్స్వయంభువా" అని భారతవచనము. అట్లైనచో బాదరాయణుఁడు శాస్త్రయోనిత్వాధికరణమందు వేదము పరమేశ్వరక కర్తృక మనియు దేవతాధికరణమందు నిత్య మనియు నపౌరుషేయ మనియుఁ జెప్పుట పరస్పర విరుద్ధముగాఁ గానవచ్చుచున్నదే యనఁగాఁ జెప్పుచున్నాఁడు. ఇచట నిత్యత్వము వ్యావహారిక మని యెఱుగవలయును. సృష్టికిఁ దరువాతఁ బ్రళయమునకు ముందు వర్తించు కాలమునకు వ్యవహారకాలమని పేరు. అట్టి కాలమందీ వేదము పుట్టినట్లు నశించినట్లు కానరాదు. కాళిదాసాదికవివిరచిత కావ్యములకువలె నీ వేదమున కొక గ్రంథకర్త యున్నట్లు తెలియఁబడదు గావునఁ గాలాకాశాదుల రెట్లు నిత్యములో యపై యీ వేదముకూడ నిత్యము. ఆది సృష్టి యందీ వేదముకూడఁ గాలాకాశాదులవలెఁ బరబ్రహ్మనుండి పుట్టినదని వేదప్రామాణ్యమువలననే తెలియవచ్చుచున్నది. కాఁబట్టి ఏమయభేదమువలనఁ బరస్పర విరోధము లేదు. పరబ్రహ్మనిదో౯ష మైనదగుటవలన వేదమునకు వక్తృదోషము లేదు. కావున దాని ప్రామాణ్యము స్వతస్సిద్ధము.

వేదముయొక్క యపౌరుషేయత్వ సమర్థనము.

జైమినిమీమాంసాశాస్త్ర ప్రథమపాదమందు వేదపౌరుషేయత్వము నిట్లు సమర్థించుచున్నాఁడు.

"వేదాం శ్చేకే సన్నికర్షం పురుషాఖ్యా? (1-1-27) చోదనయే లక్షణముగాఁ గలయర్థము ధర్మమని చెప్పఁబడినది. ఏలయన శబ్దమునకుఁ గలసం