పుట:Neti-Kalapu-Kavitvam.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

(కోపానలబహుళనీలధూమలత నందకులానికి నల్లతాచు అయి యిప్పటికీ కట్టబడుతున్న నాశిఖను వధ్యుడెవడు ఇచ్చగించడు) అని మలయ కేతునిగ్రహాన్ని సూచించి దాన్ని యింకొక్కనిదర్శనంతో

"ఉల్లంఘయన్మమ సముజ్జ్వలతః ప్రతాపం
 కోపస్య నందకులకాననధూమకేతోః
 సద్యః పరాత్మపరిమాణవివేకమూఢః
 కః శాలభేన విధినా లభతాం వినాశం" (ముద్రా)

(నందకులకానన ధూమ కేతువయిన నాప్రజ్వలించే కోపప్రతాపాన్ని ఉల్లంఘిచి యెవడు పరబలమెరుగని మూఢుడు మిడతవలె వినాశం పొందుతాడు) అని ఉపోద్బలంచేస్తాడు.

దుఃఖం అతిశయించి కొంత అధికాలాపం ఆరంభమయ్యే ఘట్టంలో కాళిదాసు రతిచేత భర్తతోగూడా భార్యపోవాలె ననేఅభిప్రాయానికి

"శశినా సహ యాతికౌముదీ సహమే ఘేన తటిత్ ప్రలీయతే." (కుమా)

(చంద్రుడితో వెన్నెలపోతుంది. మేఘంతో మెరుపులీన మవుతుంది) అని రెండునిదర్శనాలకంటె యెక్కువచెప్పించడు. ఇట్లా చెప్పినా "పునఃపునర్దీప్తి" అనేదోషం రతివిలాసానికి సంక్రమించిందని మమ్మటుడన్నాడు. అది వేరేవిషయం.

కాళిదాసు సాధారణంగా ఒకటి, రెండు, లేదా మూడు నిదర్శనాలను చెప్పుతాడు. నిదర్శనబాహుళ్యం అరుదు యెక్కడనైనా యిప్పటివలె నిదర్శనపరంపరలు అధికంగావుంటే అవి దోషమేగాని గుణంగాదు.

నిదర్శనపరంపరలు మామాలుప్రజలకు వుడుకెక్కించే సభల్లో అవసరమైతే కావచ్చునుగాని పరిణతబుద్దులకు ఉద్దిష్టమైన కావ్యాల్లో విసుగూ రోతా పుట్టిస్తవి శ్లేషలకు వాక్యాల ఉన్మగ్ననిమగ్నతలకు యత్నిస్తూ సర్వార్ధాలను గార్లించ ఉద్యుక్తమైన కాదంబరిలోని నిదర్శనపరంపరలు ప్రత్యేకించి విమర్శించదగ్గవి గనుక వాటివిచారణ యిక్కడ వదులుతున్నాను.