పుట:Neti-Kalapu-Kavitvam.pdf/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు

49

నిదర్శనాధికరణం


"దుస్తరసాగరాన్ని అజ్ఞానంచేత పుట్టితొ దాటదలచాను"

అని భావం వ్యక్తంచేశాడు కాని కొట్టికొట్టి

"హిమవత్పర్వతాన్ని చిన్ననిచ్చెనతో యెక్కదలచాను
సముద్రనికతాకణాలనుసాంతం లెక్కింపదలచాను"

అని యీ తీరున ఉడుకుసోదిలోకి దిగలేదు.

"అపూర్వకర్మచరణాల మయి ముగ్దే విముంచ మాం
శ్రితాసి చందనబ్రాంత్యా దుర్విపాకం విషద్రుమం"(ఉత్తర)

(ఓ ప్రియురాలైనముగ్దా! అపూర్వకర్మ చండాలుణ్నీ నన్ను వదలు చందనవృక్షమనుకొని దుర్విపాకమైన విషవృక్షాన్ని ఆశ్రయించావు).

అని భవభూతి శ్రీరాముడిచేత అనిపిస్తాడు. అంతేగాని సాగదీసి

"మణి అనుకొని మహోగ్రాగ్నినిచేపట్టినావు
కుసుమమాల అని క్రూరసర్పాన్ని మెడవేసుకున్నావు"

అని నదరించడు

ఆ సత్కావ్యమని అహోబలపండితుడన్న ముద్రా రాక్షసంలొ సయితం కొపసంరంభసమయంలో కూడా

"అస్వాదితద్విరదశోణితశోణశోబాం
సంధ్యారుణామివ కలాం శశలాంచనస్య
బృంభావిదారితముఖస్య ముఖాత్ స్పురంతీం
కొ హర్తు మిచ్చతి హీరే: పరిబూయ దంష్టాం"
                                          (ముద్రా)

(యేనుగునెత్తురు ఆస్వాదించి చంద్రుడి సంధ్యారుణకాంతివలె యెర్రగావున్న సింహపుకోరను ఆవలిస్తే బయటికి ప్రకాశిస్తున్నదాన్ని ఆసింహపు నోటినుండి యెవడు పరాభవించి పెరకబోతున్నాడు) అని ఒక్క నిదర్శనంతొనె రాక్షససాహసికత్వాన్ని నిరూపిస్తాడూ

"నందకులకాలభుజగీం
కొసానలబహులనీల ధూమలతాం
అద్వాసి బద్యమానాం
పద్: కో నామ నేచ్చతి శిఖాంమే" (ముద్రా)