పుట:Neti-Kalapu-Kavitvam.pdf/83

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


శ్రీ ర స్తు

వాజ్మయపరిశిష్టభాష్యం.

నిదర్శనాధికరణం

నిదర్శనప్రంపరలు

విస్తరదోషంలో నిదర్శనపరంపర యిమిడివున్నా దీన్ని ప్రత్యేకించి తెలపవలసినంత హెచ్చుగా ఈ కాలపుకృతుల్లో వ్యాపించివున్నది.

ఈ దోషాన్ని వివరిస్తాను; ఒకసంగతిని స్ఫుటపరచడానికి నిదర్శనం చలా తొడ్పడుతుంది.

"క్వ సూర్య ప్రభవో వంశ: క్వచాల్పవిషయా మతి:"
"తితీర్పుధ్దుస్తరం మోహా దుడుసేవాస్కి సాగరం"
                                            (రఘు)
సూర్యప్రభవమైన ఆ రఘువంశ మెక్కడ?
అల్పవిషయమైన నామతియెక్కడ?
దుస్తరసముద్రాన్ని పుట్తితో దాటనెంచాను

అని అన్నప్పుడు కాళిదాసు చేయదలచినకార్యం యొక్క దుష్యరత్వం యెంతో హృదయంగమంగా వ్యక్తమవుతున్నది. ఇక పైనవిదర్శనాలు చెప్పడం అధిక ప్రసంగమే అవుతున్నది.

భావం హృదయంగమంగాస్పుటపడ్డతరవాత దాన్ని యింకా చెప్పడం విసుగును రోతను పుట్టిస్తుంది. ఒకవస్తువును వెడల్పుగా పరచి పొగ గొట్టిన కొద్దీదానికి బలంతగ్గి పలచబడిపోతుంది. భావాన్ని వ్యక్తదశకు తెచ్చి వదలితే అఖండబలంతో హృదయాన్ని అధిష్ఠిస్తుంది. లేదా కొట్టికొట్టి వదలితే పలచబడి నీరసిస్తుంది. అందుకే నిరర్శనపరంపర దోషమని హేయమని చెప్పుతున్నాను. హేయం గనకనే కళాదాసాదులు ఉత్తమమార్గమునవలంబించి భావవ్యక్తిచేస్తూ కావ్యసౌందర్యాన్ని అనకు ప్రసాదించారు.