పుట:Neti-Kalapu-Kavitvam.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఊగుడుమాటల అధికరణం

47


రువుతాడని దయ్యంవలె యితరులను పడతాడని అభిప్రాయంగాదు. అసలింతకూ "బాలోన్మత్తపిశాచవత్" అనేది విరక్తుడైన వేదాంతిలక్షణం. అతడికి లోకంతో పనిలేదు.

"నిస్త్రెగుణ్యే పథి విచరతాం కో విధిః కో నిషేధః:"

అన్నట్లు అతడిప్రవృత్తి లోకాతీతంగా వుంటున్నది కాని కవి, లోకంతో అత్యంతం సంబద్దుడై లోకానికి తనకావ్యాన్ని ఉద్దేశించి లోకసంబంది విభావాదులను అలంబనందేసి గసభావాలను ఉన్మీలనం జేస్తున్నాడు. ఇతడు "బాలోన్మత్తపిశాచవత్" అనే లక్షణంగల జ్ఞానికోటిలో చేరెనా

"ఆత్మానం చేత్ విజానీయాదయమస్మితి పూరుషః
 కిమిచ్చన్ కన్యకామాయ శరీరమనుసంజ్వరేత్" (శ్రు)

అని కావ్యాన్నే వదులుతున్నాడు కాదు కూడదు పిచ్చికేకలు వేస్తాడంటారా వెర్రివాడివలె కేకలువేసి పిచ్చిమాటలు ఒక వేళ మాట్లాడి, కావ్యంలో వ్రాసినా అవి పిచ్చిమాటలే గనుక వాటితో లోకానికి పనిలేదు.

ఆపిచ్చిమాట లతనికే లోకం వదలుతున్నది.
"నావృషిః కురుతేకావ్యమీ"
"అపారే కావ్యనంసారే కవిరేవ ప్రజాపతి॥"

అని అఖండవివేకశాలిగా కీర్తితులవుతున్న కవులకు సమస్కరిస్తూ యీపిచ్చిమాటలను గురించిన ప్రస్తావన ముగిస్తాను. ఇక "శిశువదనంలో కవిత్వమున్నది. సతీవదనంలో కవిత్వమున్నది" అని అంటే కవిత్వప్రేరకమైన అంశమున్నదని అభిప్రాయంగాని అవేకావ్యమని అర్ధంకాదు. ఆభారతీయ వర్షాల్లో ఊగి వెర్రిమాటలు మాట్లాడితే మాట్లాడుతారేమోగాని కవితాప్రస్థానం మహావికాసంపొంది సర్వోచ్చదశనొందిన భారతవర్షంలో కవిపరమోన్నత మైనపదం అధిష్టించి వున్నాడు. ఊగడం, కేకలు వేయడం ఆవేశమని కవి అట్లా ఆవేశపడి వూగుతాడని పిచ్చి కేకలు వేస్తాడని యీకాలంలో వ్యాపించివున్న అభిప్రాయం అజ్ఞానజన్యమని చెప్పి యీచర్చ చాలిస్తున్నాను.

అని శ్రీ. ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర పరిశిష్టంలో

ఊగుడుమాటల అధికరణం సమాప్తం.