పుట:Neti-Kalapu-Kavitvam.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపు కవిత్వం


పొందుతారు కాని ఊగరు. వాల్మీకికి రావణుడితో సమానానుభవం వుండదు అతడు ఇష్టపాత్రలైన రామాదులతో సమానుభవం పొంది నట్లు గోచరిస్తుంది దీన్నే

"నాయకస్య కవేః శ్రోతుః
 సమానానుభవస్తతః" (ధ్య .లో)

అని భట్టతోతుడు అన్నట్లు ద్వన్యాలోకవ్యాఖ్యానంలో అభినవగుప్త పాదులు ఉదాహరిస్తారు. మేఘదూతలో యక్షుడితో కవికి సమానుభవంవున్నా

"కామార్తా పిః ప్రకృతికృపణాశ్చేతనాచేతనేఘ" (మేఘ)

అని స్వవశత్వాన్ని విదితంచేస్తాడు. భవభూతి భావసాంద్రత కెంత వశుడైనా

"నమోవాకం ప్రశాస్మహే" (ఉత్తర)
అని ఆదికవులకు నమస్కరించి
"ఏకో రసః కరుణ ఏవ" (ఉత్తర)
అని అమోఘవివేకంతో వినిపిస్తాడు.

ఆక్షేపం

అవునయ్యా "బాలోన్మత్తపిశాచవత్" అని పెద్దలు చెప్పుతున్నారు. జ్ఞాని బాలుడివలె వెర్రివాడివలె, పిశాచంవలె వుంటాడు. కవులు జ్ఞానులు వెర్రివాండ్లవలె ఊగి మట్లాడడం ఉచితమేగదా కనుక కృష్ణపక్షంలో వున్న

"పాడమన్నది చిన్నబాలుదు పాడవిన్నది గాలిమబ్బులు
 పాడినది ఒకమేకపై ఆ వెర్రిపాటకు డెవ్వడో"

అనే వెర్రిపాట మంచిదేను అని వాదిస్తారా

సమాధానం

వివరిస్తాను, "బాలోన్మత్తపిశాచవత్" అనేది కవికిగూడా వర్తింస్తుంది అనివొప్పుకొనే విచారిస్తాను. "బాలోన్మత్తపిశాచవత్" అనేది జ్ఞానికి బాహ్యలక్షణంగాని బాలుడివలె చనుబాలుగుడుస్తాడని వెర్రివాడివలె రాళ్లు