పుట:Neti-Kalapu-Kavitvam.pdf/74

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


శ్రీ ర స్తు

వాజ్మయ పరిశ్విష్టభాష్య.

వికారాధికరణం

వికారాలు

దయా, సత్యా, విజ్ఞాన, ప్రభృతిగుణాలచేత తేజస్వి అయిన మనిషికి వేషాదులు అప్రధానంగా తేజస్సుగొచరిస్తుంది. అదిలేనప్పుడు వేషం సవరించడం జుట్టుదిద్దడం ఇట్లాటివి ప్రధానమౌతవి ఇట్లాటివికారాలు ఈకాలపుకవిత్వంలొ తరుచుగా కనబడుతున్నవి.

నాలుగుపాదాలు ముగించి ఆఖరున రెండుమాటలు తగిలిస్తారు. కొందరు దరువులు పట్టిస్తారు కొందరు కృష్ణపక్ష కర్త మూడుపాదాలు వ్రాసి నాలుగోపాదంలో రెండుమాటలు వ్రాసి చాలిస్తాడు.

"మొగముగంటి గనులుగంటి, మొగిలుగంటి పాటవినుచుంటి"
"అదయతను ద్రుంచినారే
      పెంధూళి
జదిమి వెదజల్లినారే
మొదలంట దూర్చినారే
      భయదాగ్ని
కీలలను వ్రేల్చినారే"

అని పాదాల్లో యిమడని మాటలను రెండుపాదాల మధ్యన వేసి చదువుకొట్టుతున్నాడు.

"గళఘోరగంభీర ఫెళార్బటులలో
                     మెరపేలా?
నిబిడ హేమంతరాత్రీకుంతలములలో
                     చుక్కేలా?"

అని నాలుగుపాదాల్లో యిమడని వాటిని అంతాన వేస్తున్నాడు.