పుట:Neti-Kalapu-Kavitvam.pdf/68

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


33

నూతనత్వాధికరణం

ఏల నాహృదయంబు ప్రేమించు నిన్ను"
                          (దే.కృష్ణశాస్త్రికృష్ణపక్షం)
"విబుదులందరు నన్ను విడిచిపోయినను
హేతులందరును నన్ను నేవగించినను
నాప్రేమభాగ్యంపు నవ్వువెన్నెలలలు
నాపైన ప్రసరింప నాకేమిభయము"
   (గరిగపాటి రామమూర్తి - భారతి 2.111

అని యీతీరున "నేను" అని ఉత్తమపురుషతో చెప్పడం కొత్త వెనకటివాండ్లంతా యేనలుడికధనో చెప్పేవాండ్లు కాని యిప్పుడు నేను, నా, అని చెప్పుతున్నారు. ఇది కొత్తగాదా అని అంటారా?

సమాధానం

   చెప్పుతున్నాను. అది అసంబద్ధం ఇట్లాటి "నేను" పద్యాలు చిరకాలంనుండి వుంటున్నవి.

"జొన్నచేలోనుంచి సొగసుకతెనుజూస్తి
నిన్నటాలనుంచి నిరుదలేదు-"
"గొల్లవరీచిన్నది నన్ చల్లగుండూమన్నదీ"
"వరబింబాధరమున్ సయేధరములున్ వక్రాలకంబుల్ మనో
హలంలొ లాక్షులు చూప కవ్వలిమొగంబై నంత నేమాయె నీ
గురుభాస్వఘనంబు క్రొమ్ముడియు నాకుల జాల వేగంగ కి
ద్దరిమేలద్దరి కెడునుంగలదె యుద్యద్రాజబింబాననా"-

(చాటు)


"అనిదితసుఖదు:ఖం నిర్గుణం వస్తు కించిత్
జడమతిరిహ కశ్చిన్మోక్ష ఇత్యాచచక్షే
మమ తు మతమనంగస్మేరతారుణ్యఘూర్ణ
న్మదకలమదిరాక్షినీవిమోక్షో హి మోక్ష:"

     (సుఖంగాని, దు:ఖంగాని విదితముకానటువంటి ఒక నిర్గుణవస్తువు మోక్షమని ఒక బడబుద్ది అన్నాడు. నామత మదిగాదు. వికసించే యౌవనంతో ప్రకాశిస్తూవున్న స్త్రీయొక్క నివిమోక్షమే మోక్షమని నామతం)