పుట:Neti-Kalapu-Kavitvam.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నూతనత్వాధికరణం

31


పద్యాలు కావ్యం కాదని, రసభావాలసిద్ధికి సాంగస్వరూపావిష్కృతి అవశ్యకమని అవి చాటూక్తులేనని ముందు తెలుపబోతున్నాను. వాటిని కావ్య మనడం అజ్ఞానంగాని కొత్తగాదు. ఈ తెలియక పోవడం కొత్త అయితే కావచ్చునుగాని కొత్త గుణప్రతిపాదకమైనపుడే గ్రాహ్యం గనుక దానిని ఉపేక్షిస్తున్నాను. ఇక ఈ కాలపుకృతులలో వుండే నిదర్శనపరంపరలు, దరువులు, విరుపులు వికారాలని, వృత్తంతో సంబంధించని జడకుచ్చులవంటి పేర్లు అనుచితమని ముందు నిరూపించబోతున్నాను. ఇఘ వాగులు, కొండలు, మేఘములు, విద్యుల్లతలు, వీటిమీది ఆసక్తి యీకాలపు కృతికర్తలకు కొత్త ఆనడం అవివేకం. భారతీయకవుల కివి చిరకాలంనుండి ప్రేమపాత్రంగా వున్నసంగతి భారతీయవాఙ్మయం బహుముఖాల వ్యక్తం చేస్తున్నది.

"ఉద్యానే సరణిః సర్వఫలపుష్పలతా ద్రుమాః
 పికాలికేకిహంసాద్యాః క్రీడావాప్యధ్వగస్థితిః,
 శైలే మేఘౌ షధీధాతువంశ కిన్నర నిర్ఘరాః". (సాహిత్య)

అని యీతీరున వీటిని కావ్యవేత్తలు విడదీసి సయితం చెప్పినారు. రసభావాలసందర్భా లకు తగినట్లు సర్వజగత్తునందు మృదువుకఠినం ప్రసన్నమప్రసన్నం ఋజుకుటిలం అయిన సమస్త పదార్ధసంచయాన్ని పరిణతదృష్టితో చూడగలిగిన భారతీయకవుల సృష్టి అమేయమై వెలసివున్నది.

"రమ్యం జుగుప్సితముదారమధాపినీచ
 ముగ్రం ప్రసాది గహనం వికృతం చ వస్తు
 యద్వాప్యవస్తు కవిభావకబావ్యమానం
 తన్నాస్తి యన్న రసభావముపైతి లోకే." (దశ)

అని దశరూపకకారుడు చెప్పుతున్నాడు ఇట్లాటి భారతీయవాఙ్మయంలో ఈకాలపు కృతికర్తలకు వాగులకొండల లతల కోయిలలమీది ప్రీతి కొత్త అనడం అవివేకమే అవుతుంది.