పుట:Neti-Kalapu-Kavitvam.pdf/65

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


30

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

వుచితంగా వుంటే అవి కావ్యానికి గుణాన్నే ఆపాదిస్తవి. ఉచితదశల్లో మనోహరంగా వుడే ఋతుసందేశాలకు చంద్రుడికి కవియెట్లా విముఖుడు కాగలడు? అనుచితంగావుంటే అవి ధోషమె అవుతవి అంతేగాని అవి వుండడం లేకపోవడం కవిత్వానికి నూతనత్వ మాపాదిస్తవనడం అసంగతం అసిలింతవరకూ ఋతువర్ణనలూ, చంద్రోపాలంభాదులూ అనుచితమైన జంబితాలుగా లేని మేఘసందేశాదులు శాకుంతలాదులు ఓరోరిబండోడ ఓరందకాడా బంగారు బావా మొదలైన పాటలు చాలాకాలంనుండి వున్నవి దీంట్లో యేమీకొత్తలేదు. కనుక ఋతువర్ణనలు చంద్రోపాలంంబాదులు మొదలైనవి లేకపోవడంవల్ల యీకాలపు కవిత్వం కొత్త అనడం అసంబద్ధమంటున్నాను.

పూర్వాక్షం

 అవునయ్యా యిప్పటికవులు ఒకటి రెండుపద్యాలు మాత్రం వ్రాసి ఒకపేజీమీద ప్రత్యేకంగా అచ్చువేస్తున్నారు. వెనకటి కావ్యాలన్నీ యెంతో విపులమైనవి. యిది కొత్త అంటారా?

సిద్దాంతం.

 వెపుతున్నాను అది అసంబధ్దం వెనుకటి కవులుగూడా ఇట్లా ఒకటి రెండు పద్యాలు వ్రాశారు.

"రంజనచెడి పాండవులరిభంజనులైవిరటునిగొల్వ పాల్పడిరకటా"
"నరసింహ కృష్ణరాయల కరమరుదుగకీర్తియెప్పె"
'కైభిత్ గిరిభిత్ కరికరిభిత్ గిరిగిరిబిత్
"కరింబిత గిరిభిత తురంగ కమనీయంబై"
"కాశికావిశ్వేశు గలిసె వీరారెడ్డీ
"రత్నాంబరంబులే రాయడిచ్చు" (చా)

    ఇవన్నీ అట్లాటివే వీటికే చాటూక్తులనిపేరు. ఇప్పటి పద్యకర్తలు వ్రాసేవిగూడా మనోహరంగా వుంటే చాటూక్తులే అవుతవి. వీటినివీరు కావ్యమంటున్నారు. ఇది కొత్త అంటారా? అది వీలుగాదు. ఒకటి రెండు