పుట:Neti-Kalapu-Kavitvam.pdf/64

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


29

నూతనత్వాదికరణం

యేలయేలపొదలు వెదకెద వింత వింతలె యెందుజూచితి"

(వృషభగతిరగడ-వసు

అని యీతీరున దరువులు విరుపులు చిరకాలమునుండి వున్నవిగాని కొత్తవిగావు. వీటిలో ఉత్కళిక గురుజాడాప్పారావు కన్యక అనే ఖండ కావ్యపు వృత్తానికి మూలమనదగినది. వీరు కట్టుబాట్లు తెంపి కావ్యాలు వ్రాస్తున్నారు. అది కొత్త అంటారా? అదిగూడా నిల్వజాలదు. కట్టుబాటులో కవిత్వమా అని చెప్పిన పీఠికాకర్త కృష్ణపక్షంలో వళులు, ప్రాసలు మొదలైన వాటికిందనే వున్నాడు.

..... మాలికలంబ్రణయార్ద్ర
..... బూవుపూవునకు
ఆకులో నాకునై (మురుపుమూస)
యదృశ్యమౌ నిద్రబోవు (కృష్ణపక్షం)

అని యీతీరున మగామం గజడదబల గసడదపల అదేశం, యడాగమం మొదలైనవన్నీ వెనుకటికావ్యాల్లో వలెనే వున్నవి. యెంకిపాటలు యెంకయ్య చంద్రమ్మ పాట యిటువంటి కావ్యాల్లో భాష కొత్తది అంటారా అదీ సరిగాదు.

"యెట్లా పోనిస్తువోయిమట్లానోరి చిన్నదాన్ని"
"ఓరందకాడా బంగారుబావా"

అనే యిట్లాటి యాటపాటల్లో చిరకాలమునుండి యీభాష వుంటూనే వున్నది.

ఆక్షేపం.

  అవునుగాని నీటిలో ఋతువర్ణనలు చంద్రోపాలంభాదులు మొదలైనవి లేవు గనక యీకలపు కవిత్వం కొత్త అంటాము అని వాదిస్తారా?

సమాధానం

   చెప్పుతున్నాను మీమాట సరిగాదు. ఋతువర్ణనలు మొదలైనవి వుండడంలేకపొవడం కవిత్వానికి నూతనత్వ మాపాదించవు. సందర్బానికి