పుట:Neti-Kalapu-Kavitvam.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నూతనత్వాధికరణం

27


సిద్ధాంతం.

చెప్పుతున్నాను. మీరన్నమాటసరికాదు. ఇప్పటికవులుగూడా చంపకమాలలు మొదలైనవి తరుచుగా వాడుతున్నారు, వనకుమారి నిండా ఈవృత్తాలువున్నవి. కొమాండూరి కృష్ణమాచార్య కృతులైన విరహోత్కంఠిత, పాదుకాస్తవం ఇవి వృత్తమయాలు గీతాలు, ద్విపదలు వెనుకటివారు సయితంవాడినారు వెనుకటివారు అక్కడక్కడ వాడినారుగాని, యిప్పటివారు గ్రంథమంతా గీతాలుగాని ద్విపదగాని వాడుతున్నారంటారా? అదిగూడా అసత్యం రంగనాథుడు శ్రీనాథుడు మొదలైనవారు కేవలం ద్విపదలలోనే గ్రంథమంతావ్రాశారు. ఇక వేమనశతకం చాలామట్టుకు గీతమయమేగదా ఇట్లాగీతాలు, ద్విపదలు గ్రంథమంతా వాడడం మనకు కొత్తగాదు. ఇప్పుడెక్కువమంది వాడుతున్నారంటారా అదిసరిగాదు. అప్పుడెంతమంది అట్లాగీతమయంగా ద్విపదమయంగా వ్రాశారో యెవరెరుగుదురు?

నలచరిత్రం. సారంగధరచరిత్ర (బాణాల శంభుదాసుడు)

ధర్మాంగదచరిత్ర (బొమ్మకంటి నృసింహకవి)

మైరావణచరిత్రం. భారతోద్యోగపర్వం (తిమ్మయ)

గీతరఘునందనం (తిరుమలకవి)

ఇట్లా ద్విపదగ్రంథాలెన్నోవున్నవి. వీట్లో అచ్చుపడనివి కొన్ని వున్నవి. యథా వాల్మీకమనే ద్విపదరామాయణం. ద్విపదబారతమే వున్నవని తెలిసినప్పుడు ఆకాలంలో ద్విపద యెంతవ్యాప్తిలో వుండేదో మనకు గోచరిస్తున్నది. ఇఘ ముత్యాలసరంవంటి పద్యాలను విచారిస్తాను. ఈ తీరుగా కొత్త పద్యాలను వాడడం యిప్పటి యీతొలకరి కృష్ణ పక్షం మొదలైన కృతికర్తలతో ఆరంభంగా లేదు. భారతరామాయణాల్లోలేని రగడలను పెద్దనవాడినాడు. శ్రీనాథుడు, పోతన అదివరకు నన్నయ తిక్కనలు, యెర్రాప్రగడా వాడని దండకాలను వ్రాశారు.

శ్రీ కొక్కొండ వేంకటరత్న శర్మవారు వెండి బంగారు రత్నం మొదలైన కొత్తపద్యాల నెన్నిటినో నిర్మించారు. కనుక కొత్తపద్యాలను వాడడం నేడు కొత్తగావచ్చిందికాదు. ఒకవేళ వచ్చిందని నొప్పుకున్నా అది పద్యాలకొత్త అవుతుంది కవిత్వంలో కొత్తగాదు గదా యెందుకంటే