పుట:Neti-Kalapu-Kavitvam.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నూతనత్వాధికరణం

25


మోహనవినీల జలధరమూర్తి నేను
ప్రళయ ఝుంఝూప్రభంజన స్వామి నేను."
                                      (దే. కృష్ణశాస్త్రి కృష్ణపక్షం)

అని యింకా యీతీరున ఆత్మస్తుతులు కృష్ణపక్షకర్తవలె చేసుకుంటే రోతగానే వుంటుంది.

పాపాయి అనేకృతిలో తత్కర్త

"లేశమేనియుఁ బ్రఖ్యాతి లేని నాకు
 కలిగె పాపాయి తండ్రియన్ గౌరవంబు
 పద్ధియంబులు నీపేర వ్రాయు కతన"

"రాణ నొప్పారె నాంధ్రసారస్వతాబ్ధి
 కావ్య మణులెన్నియో నేటికాలమందు
 వాని నెల్లను సరిపోల్పవచ్చునొక్కొ
 తావకానూనకావ్యరత్నంబుతోడ" (భారతి)

అని మొదట తన్ను తాను స్తుతించుకొని తరవాత యితరులు స్తుతించారని చెప్పుతున్నాడు. ఈస్తుతి ఇంకా వున్నదిగాని ఉదాహరించక మానుతున్నాను.

యెంకిపాటల్లో ఆత్మస్తుతిచేసుకో వీలులేక వాట్లో మాట్లాడేది పాత్రలే గనక ఆత్మస్తుతులను పాత్రలకు యెంకిపాటలకర్త ఒప్పగించాడు.

"కతకాడుమావూసె చెప్పాలె
 ఈసీమ ఆసీమ అందరందాలు
 తిన్నగా నినుజూసి దిద్దుకుంటారు
 ముందు మనపాపణ్ని కిందదిగనీరు
 యెంకొక్క దేవతై యెలిసెనంటారు."

ఇవి నాయుడి ఆత్మస్తుతులు

ఈవక్రమార్గపుస్తుతులతో తనివిలేక--

"ఆమహోన్నతభవాలకు నాయెంకిపాటలే కారణమైతే ధన్యుడను ... ధన్యుడను .... నన్ను ప్రత్యేకించి ఆహ్వానించి గౌరవించారు". అని కూడా యెంకిపాటలకర్త చెప్పుకున్నాడు. యిట్లాటి ఆత్మస్తుతులు