పుట:Neti-Kalapu-Kavitvam.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నూతనత్వాధికరణం

23


అంగీకరించ వీలులేదంటున్నాను" జగమునిండ స్వేచ్చాగాన ఝురుల నింతు" అని యీతీరునచెప్పలేదుగదా అంటే అట్లాచెప్పడం ఒకశ్ళాఘ్య లక్షణంగాదు.

ఉత్తము లెప్పుడూ తమగుణాలను కార్యాలచేత విదితంచేస్తారు గాని చెప్పుకోరు. అది తేలిక మనుషుల యొక్క వెలితి లక్షణం ఈ సంగతినే.

"తస్య సంవృతమంత్రస్య గూఢాకారేంగితస్య చ.
 ఫలానుమేయాః ప్రారంభాః" (రఘు)

(ఆలోచన గూఢంగావుండే ఆయన యత్నాలు ఫలాలవల్లనే కనుక్కోదగినవి.)

అనే పఙ్త్కులవల్ల కాళిదాసీభావాన్నే వ్యక్తం చేస్తున్నాడు

"బ్రువతే హి ఫలేన సాధవో న తు వాక్యేన నిజోపయోగితాం"

(సాధువులు నిజోపయోగితను మాటలచేత చెప్పరు. ఫలాల చేత కనబరుస్తారు.)

అని శ్రీహర్షు డీ అంశాన్నే తెలుపుతున్నాడు.

ఇంతకూ ఇట్లా చెపుకొన్నవాండ్లుకూడా వెనకవున్నారు
అర్జవవేష్టి తాఖిలమహామహిమండలమందు బూతులం బూర్ణుడ
                                                        (జగ్గకవి - చంద్ర రేఖా)

"ఎవ్వరేమన్న నండ్రు నాకేమికొరత" (శ్రీనథుడు-కాశీ)

ఈతీరుగా వారివారి స్వాతంత్ర్యాన్ని చెప్పుకొన్నారు. అసలిట్లా చెప్పుకొనడం లఘుత్వద్యోతక మని అది కొత్తగా దనితెలిపినాను. కనుక స్వాతంత్ర్యప్రకటనంవల్ల ఇప్పటికవిత్వంకొత్త అన్న మాట నిలువజాలదు.

"మ్రోడుమోక చివురులెత్తి మురుపుసూప"
"కర్కశశిలయ నవజీవ కళలుదేర"
"జగము నిండ స్వేచ్ఛాగాన ఝురులనింతు" (కృష్ణపక్షం)

అని యిట్లా ఆత్మస్తుతిచేసుకొనడం గూడా కొత్తగాదు

ఇతరు లక్షరరమ్యతనాదరింప (భా- నన్నయ)
"విటుడు యతిగాక పోవునే వెస మదీయ