పుట:Neti-Kalapu-Kavitvam.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


"జగమునిండ స్వేచ్ఛాగానఝురులనింతు". (కృష్ణపక్షం)

"స్వాతంత్ర్య గీతానాదమే స్వర్ణయుగమునకు ప్రాణభూతము,
 పోకడలు స్వతంత్రములు భావములు స్వతంత్రములు
                                          దశిక సూర్యప్రకాశరావు (భారతి)

అని ప్రకటించిన తీరున ఇప్పటికవులు స్వాతంత్ర్యాన్ని కనబరుస్తున్నారు. ఇట్లాటి స్వాతంత్ర్యంపూర్వుల్లో లేదు. కనుక ఇది కొత్తకవిత్వం అని వాదిస్తారు.

సమాధానం

చెప్పుతున్నాను అదిసరిగాదు. స్వాతంత్ర్యం సర్వకాలాల్లోను వున్నది. ఒకహద్దుకు లోబడ్డ స్వాతంత్ర్యాన్ని ప్రాచీనకాలంనుండి భారతీయులు గౌరవిస్తున్నారు.

ఇట్లాటి స్వాతంత్ర్యం రానురాను భవిష్యత్ప్రజల్లో నశిస్తుందని చింతపడ్డారు.

"స్వాతంత్ర్యం కౌశలం కాన్తిర్త్ధర్యం మార్దవమేవ చ (శ్రీభా)

అని యీగుణాన్ని శ్రీభాగవతకారుడు ప్రశంసిస్తున్నాడు.

"సర్వం పరవశం దుఃఖం సర్వమాత్మ వశం సుఖం" (మను) అని మనువు చెప్పుతున్నాడు.

అయితే నేను పాఠశాలనుమాని యెగురుతాను. ఆచార్యులవద్ద విద్యనేర్వడం స్వాతంత్ర్యానికిభంగం అందువల్ల నాకు యేవిద్యావద్దు అని అనడం అనర్థహేతువు. అజ్ఞానాపాదకం గనుక అది స్వాతంత్ర్యం గాదు. అందుకే కొన్నిహద్దులకు లోబడ్డ స్వాతంత్ర్యాన్ని భారతీయులు ఆరాధించారన్నాను. కవిత్వంలో చూస్తామా యెవరి మనః ప్రవృత్తిని అనుసరించ్క్షి వారుసృష్టి చేశారు. కాళిదాససృష్టి వేరు భవభూతిసృష్టి వేరు. భవభూతి స్వతంత్రించి "ఏకోరసః కరుణఏవ" (ఉత్తర) అని ఉపదేశించాడు. "మురారేస్తృతీయ; పన్ధా:" అని ప్రసిద్దమేగదా! దీన్ని విస్తరించి వ్రాయవలసిన పనిలేదు. "నిరంకుశాః కవయః" అనేమాటలే చాలును అవిబారతీయ కవుల యీస్వాతంత్ర్యాన్ని అస్ఫుటద్వనితో వినిపిస్తున్నవి కనుక స్వాతంత్ర్యం వల్ల ఈకాలపు కవిత్వం కొత్తదంటే