పుట:Neti-Kalapu-Kavitvam.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


ఆక్షేపం.

అవునయ్యా యిట్లాటివి వెనకటికావ్యాల్లో వుంటే వుండవచ్చును కాని అవి ఆకావ్యాల్లో కొన్నిచోట్ల మాత్రేమే వున్నవి. యిప్పటి కావ్యాలనేకాలు అంతటా మెత్తటి అర్ధంగల మాటలతో నిండి ఆద్యంతం మెత్తగా వుంటున్నవి ఇది కొత్త: అని వాదిస్తామంటారా?

సమాధానం

చెప్పుతున్నాను మీ రన్నట్లు ఇప్పటికొన్ని కావ్యాల్లో పద్యాలన్నీ మెత్తమెత్తటిమాటలతో మెత్తగా వుండడం నిజమే కావచ్చును. అట్లా పద్యాలన్నీ మెత్తమెత్తటి అర్ధంగల మెత్తమెత్తటి మాటలతో మెత్తమెత్తగా వుండడం దోషమని భారతీయులు మాని వుండవచ్చును. మధురం తియ్యని మృదులం మోహనం యిట్లాటివి నిండుగా వుండడం శబ్దవాచ్యత అనే దోషమని ముందు వివరించబోతున్నాను. ఇక వెన్నెల చెండు పూలపాలు అనే యిట్లాటిమాటలె అసంగతం. లౌకికమైనట్టి లేదా భావరూపమైనట్టి సంబంధంమీద ఆధారపడి సాదృశ్యంగాని ఆరోపంగాని కల్పన చేయవలసివుంటుంది. లేకుంటే యోగ్యతా విరహంచేత ఆమాటలు అసంబద్దమే అవుతున్నవి. వెన్నెల చెండ్ల వంటివి యిట్టాటి అసంబద్ధపుమాటలే అవుతవి విస్తరభీతి చేత యీచర్చ ఆపి ప్రస్తుత విచారణకు వస్తాను వెన్నెల చెండ్లవంటివి మంచిమాటలే నని కొంతసేపు వొప్పుకొనే విచారిస్తాను. ఇట్లాటిమాటలు మంచివైతే దేశకాలపాత్రాల ఔచిత్యాన్ని పరిపాలించి సందర్భానుసారంగా వాడితే ఆకావ్యం యింపుగానే వుంటుంది కాని పాలు, పూలు, చెండ్లు, మధురం, శిరీషం, పేశలం, మృదులం, జిలుగుపూలు, వెన్నెల యిట్లాటి మాటలతోనే నింపి కావ్యమంతా మెత్తటి అర్ధాల మెత్తటిమాటలతో మెత్తగావుండే టట్లు చేయవలెనంటే తప్పకుండావెగటూ, భావసంకోచం తటస్థిస్తున్నవి. దశరూపక కారుడన్నట్లు ఉక్తరసాల్లోరమ్యం, జుగుప్సితం, ఉగ్రం, ప్రసాది, గహనం, వికృతం అయి అనేక రూపాలతో వున్న ప్రకృతిని వాచ్యం చేసేకవికి తద్దనుగుణాలైనభావాలూ శబ్దరూపాలూ యెన్నో స్వీకార్య