పుట:Neti-Kalapu-Kavitvam.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

"క్షణే క్షణే యన్నవతా ముపైతి
తదేవ రూపం రమణీయతాయా:" (మా.4)

అని మాఘు డంటున్నాడు.

అసలు నూతనత్వమే కవిత్వాన్ని ఉపాదేయకొటిలో చేరుస్తున్నది. అది లేదా పాడిందేపాట అయి హేయకోటిలో చేరుతున్నది. అందుకే శబ్దాలు అర్ధాలు వెనుకటికవులు వాడినవే అయినా శక్తిమంతుడైన కవి వాటినే స్వీకరించి కావ్యంరచించినప్పుడు నూతనత్వం ప్రకటితంవుతున్నదని.

"దృష్టపూర్వా అపి హ్యార్ధాః కావ్యే రసపరిగ్రహాత్.
 సర్వే నవా ఇవాభాన్తి మధుమాస ఇవ ద్రుమాః"

అనే వాక్యాలతో ఆనందవర్ధనుడు చెప్పుతున్నాడు. అంతేగాదు భావాలన్నీ మహాకవులు గార్లించారే ఇక మనమేమి కొత్దిది చెప్పగలమని భయపడవద్దు అనంతంగా బిన్నస్వరూపాలు వహిస్తున్న యీప్రకృతిలో కాలం దేశం ప్రాణులమనో ప్యాపారలీలలు కవికి నూతనత్వం ప్రదర్శిస్తూనే వుండగలవనే ఆశయాన్ని సయితం ఆనందవర్ధనుడు.


"స్వభావో హ్యయం వాచ్యానాం చేతనాచేతనానాం యదవ స్థాభేదా ద్దేశభేదాత్యాలభేదా దా త్స్వాలక్షణ్యలక్షణభేదా చ్చానంత తాభవతి తైశ్చతధావ్యస్థితైః సద్బి: ప్రసిద్దానేకస్వభానుసరణరూపయా స్వభావోక్త్యాపి తావదుపనిబధ్యమానై: నిరవధి: కావ్యార్ధ: సంపద్యతే (ధ్వన్యా)


(అవస్థాభేదంవల్ల దేశభేదంవల్ల కాలబేదంవల్ల అనితరలక్షణాలు కలిగివుండడమనే వైలక్ష్యణ్యంవల్ల కావ్యంలో వ్యర్ధభూతమైన చేతనా చేతనాలయొక్క అనంతత ప్రకృతి సిధ్దం ఇట్లాబిన్నంగా వ్యవస్థితమైన యీచేతనాచేతనాలను ప్రసిద్ధానేకస్వబావానుసరణ రూపమైన స్వభావోక్తి చేత ప్రతిపాదిస్తూరచించినా కావ్యార్ధం అనంతంగా సంపన్నమవుతున్నది") అనే పఙ్త్కుల్లో తెలుపుతున్నాడు.


"యా వ్యాసారవతీ రసాన్రసయితుం కాచిత్ కవీనాం నవా దృష్టి" (ధ్వన్యా)