పుట:Neti-Kalapu-Kavitvam.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నూతనత్వాధికరణం

7


విషయం ఈ కావ్యాలు నూతనమని అనేకుల అభిప్రాయమని చెప్పినాను.

"ఈ కృతులనేకములు భావగీతములని యిప్పుడు ప్రచారమునకు వచ్చిన కొత్త కవితాప్రపంచమునకు చేరినవి.

సంస్కృతంయొక్క దాస్యంనుండి విముక్తి నొందుచున్నామని మానమ్మకము."

క. రామలింగారెడ్డి (లక్ష్మీకాంత తొలకరి పీఠిక)

"మనవారు కొత్తవారైనారు"

-దే. కృష్ణశాస్త్రి (యేకాంత సేవ పీఠిక)

"నవ్యాంధ్ర కావ్యరీతులు - కడచిన పదియేండ్లలో పొందియున్నవి."

పు.సూరిశాస్త్రి (ఆంధ్ర హెరాల్డు)

"ఇంతవరకును మనకవులు సంస్కృతమునందు వివరించబడిన సంప్రదాయములను శిరసావహించి పనిచేసిరి. మార్పులురాక తప్పదు. ప్రాచీన సంప్రదాయూములయెడ గౌరవము తగ్గెను. మార్పులు రాక తప్పదు. ఆంధ్ర భాషాచరిత్రమున నేడొక నూతనాధ్యాయము ఆరంభమగుచున్నది"

-నిడమర్తి సత్యనారాయణమూర్తి (భారతి సం. 3 సం. 3)

"ఆయందము ఆనూతనవికాసము స్వర్ణయుగపు వాఙ్మయ చిహ్నాలు."

-దశిక సూర్యప్రకాశరావు (భారతి).

ఈ తీరుగా ఈ చిన్నకావ్యాలూ వీటికవిత్వం కొత్తదనీ భారతీయుల సంప్రదాయాలను అతిక్రమించి స్వేచ్ఛవహించడంవల్ల ఆనూతనత్వం వచ్చిం దనీ, అది మన మిదివర కెరుగమనీ అంటున్నారు యీవిషయాన్ని యిక విచారిస్తాను.

నూతనత్వం

వాస్తవంగా నూతనకవిత్వం నూతన కావ్యాలు అని వినగానే నాకెంతో ఆనందం కలుగుతున్నది. నూతనత్వం అభిలషణీయమైనది పరిణతబుద్దులైన మన ప్రాచీనులు నూతనత్వాన్ని మిక్కిలి అరాధించారు.