పుట:Neti-Kalapu-Kavitvam.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

సంస్కారాధికరణం

నేటికాలపు కవిత్వాన్ని విచారణచేసి అదిప్రాయికంగా దృష్టి సంకోచంచేత హీనంగా వున్నదని, పులుముడు, అయోమయం, శబ్దవాచ్యతమొదలైన దోషాలతో దూషితమైనదని, నేటికాలపు కృతులు ప్రాయికంగా చిల్లరశృంగారమని క్షుద్రాలని కావ్యంపతితదశలో వున్నదని విశదపరచాను. సాతవాహనుల కాలం శతశతాబ్దులకింద గడిచింది. వొరంగల్లు వైభవం విశేషబలప్రదంకాకుండానే అంతరించింది. తరువాత ఆంధులు భారతవర్షంలో అజ్ఞాతసీమల్లో అణగిపోయినారు. దక్షిణాన కాంచి, మధుర, ఉత్తరాన ఇంధ్రప్రస్ధం, ఉజ్జయినీ, కౌశాంబి, పాఠలీపుత్రం విదిశ, ధార మొదలైన నగరరాజులవలె సర్వభారతవర్షాన్ని ఆకర్షించిన మహారాజధానులకుగాని, రామేశ్వరం, ప్రయాగ, అయోధ్య, ద్వారకమొదలైన పట్టణాలవలె సర్వభారతవర్షం సన్నివిష్టమయ్యే మహాక్షేత్రాలకుగాని, నవద్వీపం, కాశి, కాశ్మీర, శారదాపీఠంమొదలైన పవిత్రస్థలాలవలె సర్వభారతవర్షాన్ని పాదాక్రాంతం జేసిన మహావిద్యాస్థానాలకుగాని ఆంధ్రదేశం ఆకరంగాలేదు. రెడ్లకింద కొంచెంతలయెత్తనారంభించి తిరిగి దైవోపహతమయింది. వెనక చాళుక్యుల చేతిలోవలె, రాజ్యాలగతులు క్షణక్షణం వ్యత్యస్తమయి క్షుబ్ధావస్థయందున్న దశలో విదేశీయులైన విజయనగరరాజుల వశమైనాము. పురాణేతిహాసాల ఛాయలు సంస్కృతచ్ఛందస్సుతో పులుముడు భాషావ్యతిక్రమం ఛందోభంగం మొదలమైన ఘోరదోషాలతో నిర్బద్ధవళిప్రాసల అనర్థాలతో నిండిన మను, వసు, చరిత్రలవంటి క్షుద్రకావ్యాలే మనకు సర్వభారతీయసంస్కారమై, పద్యం వ్రాయడమే కవిత్వమయింది. అదే పరమవిద్య అయింది. ఆ పద్యంసయితం అశాస్త్రీయమైన మురికిలక్షణాలతో