పుట:Neti-Kalapu-Kavitvam.pdf/300

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు

265

ప్రకాశాధికరణం

   (కావ్యంలో దోషం కొద్దిదైనా ఉపేక్షించరాదు. శరీరం సుందరమైనదైనా ఒక్కకుష్టంచేత దుర్బరమవుతున్నది) 

అని దండి అంటున్నాడు.

   "సభాం వా న ప్రవేష్టవ్యం వక్తవ్యం నా సమంజసం
   అబువన్ విబ్రువన్ నాపి నరో భవతి కిల్పిషి" (మను)

   (సబలో ప్రవేశించరాదు. ప్రవేశించిన తరువాత సత్యమే తెలుపవలెను. అసలు చెప్పకున్నా సక్రమార్గంఓ చెప్పినా నరుడు పాపి అవుతున్నాడు) అని మనువుచెప్పుతున్నాడు. పులుముడు అయోమయం క్షుద్రశృంగారం మొదలైనవాటిచేత లోకం వంచిత మవుతున్న దని తెలిసినప్పుడు సత్యప్రకటనం ధర్మమని అనుకొంటున్నాను. ఇకగుణాలవిషయం నాకు కనబడ్దవరకు చెప్పినాను. మరేదైనా గుణాలువుంటే యేవరైనా చెప్పితేవింటాను. అని దోషాలని విన్నవిస్తాను. గుణాలైతే సంతోషిస్తాను మనవారు పరిణతబుద్దులై సంస్కారపరిపాకంతో గునవత్యావ్యాలు రచిస్తే యెవరికి ఆనందదాయకంగాదు?
   అని శ్రీ..ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలోవాజ్మయసూత్ర
        పరిశిష్టంలో ప్రకాశాధికరణం సమాప్తం