పుట:Neti-Kalapu-Kavitvam.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

254

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


పూర్వపక్షం

అవునయ్యా ,ఇతరులవి యెత్తి వ్రాసుకొంటే యెవరికేమీ హానీ లేదు అది నింద్యంగాదంటే.

సమాధానం

చెప్పుతున్నాను స్వకీయపరిపాక బలం చేత, కృషివశాన, కొన్ని భావాలు, అంశాలు కొందరు పరిణతచిత్తులు ప్రకటిస్తారు. వాటినితరులు యెత్తి వ్రాసుకొనేటప్పుడు వారి పేరు చెప్పడం, చిత్తపరిపాకాన్ని కృషిని గౌరవించడమే కాక విజ్ఞాన ప్రవృద్ధికి హేతువు కూడా అవుతున్నది. అవి వీరిభావాలు, ఇవి వీరు కనుగొన్న అంశాలు, లోకకల్యాణానికి విద్యా వర్థనానికి అనుకూలమైన భావాలను, అంశాలను నేను కొన్నిటిని ప్రకటింతును గాక! అని చోదన కలగగలదు. ఇట్లాటి నూతనాంశాలను కనుగొనడం, భావాలను ప్రసాదించడం విద్వద్గోష్టులో విద్యాభ్యాసం చేసి ధ్యానబలం సమకూర్చుకొన్న పిమ్మటగాని జరగదు. ఈ తీరుగా ఉత్తమ విద్యావ్యాప్తి, నూతనాంశాలు, భావాల ఉపలబ్ది మనకు ప్రాప్తించగలవు. యేమీ లేక పేరు చెప్పకుండా యెత్తి వ్రాసుకోవడం వల్ల చిత్త పరిపాకాన్ని, కృషిని అగౌరవించడమే కాకుండా, నూతనాంశాలు, బావాలు ప్రసాదించే శక్తి జాతికి నశించి విజ్ఞానకృషికుంఠితమై యెత్తి వ్రాసుకొనే దశతోనే అది సమాప్త మవుతున్నది. పేరు చెప్పకుండా యెత్తివ్రాసుకొనడమే విద్య అనుకొనడం వల్ల విద్యావంచన సంభవిస్తున్నది. ఈ తీరుగా విద్యాజాడ్యం తనది కానిది అనడం వల్ల లోక వంచన ఆత్మవంచన ఆపతితమవుతున్నవి.

అంతేకాక భారతీయులము ఆర్యులమైన మనము ఆంధ్రులము స్వకీయమైన భారతీయ సంస్కారం యొక్క మహిమను యెంతవరకు దర్శించాము? ఈ తీరుగా హిందీ, బంగాళీ మరాటీ మనకెన్నాళ్లు