పుట:Neti-Kalapu-Kavitvam.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దోషసామ్యాధికరణం

251

మంగళ ప్రాయస్య ప్రథమ మనుపాదేయత్వే ప్యుపాదానం

                                                

వ్యభిచారి


త్వేపి స్థాయిత్వాభిధానార్థం తేనానిర్వేద స్థాయిభావః శాంతోపి నవమోస్తి రస ఇతి. సద్వితీయః వైరాగ్యాదిసామగ్ర్యాః సులభత్వాత్. తథాహి. వైరాగ్య పరమేశ్వరానుగ్రహ ప్రాచీన కుశల పరిపాకసత్పురుష సేవా వేదాంత విచారాదయో విభావాః యమ నియమాదయోనుభావాః మతిస్మృతి చింతా ధృతివితర్కాదయో వ్యభిచారిణః సతృతీయః రాగద్వేషకలుషితాంతఃకరణా నామచర్వణీయత్వేన అశ్లాఘ్యత్వేపి వీతరాగాణాం తదభావాత్ యది కతిపయాశ్లఘ్యత్వమాత్రేణ రసత్వాత్ ప్రచ్యవేత్త ర్హి వీతారాగాణామశ్లాఘ్య ఇతి శృంగారోపి ప్రచ్యవతా తస్మాన్నవైవ రసా ఇతి సిద్ధం (రత్నా)

అని కుమారస్వామి సోమయాజి రత్నాపణంలో వివరించాడు.

ఈ పంక్తులనే శ్రీ రామశాస్త్రివారు తనవిగా భారతిలో వ్రాశారు. ఇక వీరు ఈ కాలపు వారి రచనలను దొంగిలించి ఈ వ్యాసాన చేర్చిన అంశాలు తెలపడం అనవసరం గనుక ఇంతటితో వదలుతున్నాను.

చివరకు పత్రికల్లో వేసే హస్యాలు కూడా పేరు చెప్పకుండా ఇతరులవి స్వీకరించి తమవిగా వంచన చేస్తున్నారు. "ఆంధ్రపత్రికకు ప్రత్యేకం" అనే శీర్షిక కింద మూడు తమాషాలు కనబడినవని ఆనాడే వెలువడిన తెలగ పత్రికలో యీ తమాషాలే కనబడ్డవి. తమాషాకర్తలు తమాషాల మాతృకలను పేర్కొందురుగాక అని శ్రీ మల్లాది వేంకటకృష్ణశర్మ వారు కలిశకం 5028 మార్గశీర్ష శుద్ధ సప్తమి గురువారం (క్రీ.శ. 1927 డిసెంబరు 1-వ తేది) త్రిలింగ పత్రికలో వ్రాసినదాన్ని చదివినాను. ఇట్లా చిల్లర వ్యాసాలు వద్ద నుండి విషయ ప్రధానమై విచారణల దాకా అనేకులు ఇతరుల వాటిని దొంగిలించి పేర్లు చెప్పకుండా తమదైనట్లు ప్రకటించుకొంటున్నారు. పత్రిక వ్యాసాల్లోనే