పుట:Neti-Kalapu-Kavitvam.pdf/283

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

248

వాజ్మయ్ పరిశిష్ట్యభాష్య్తం - నేటికాలపుకవిత్వం

ఉత్తరం వ్రాయలేదు; ఈ తీరుగా పీఠికల కోసం కృతికర్తలు ఆశ్రయ్లించడం సాధారణమైన పనిగా వున్నది. అయితే యెంకిపాటలు యేకాంత్గ సేవ మొదలైన వాటికి ఉపోద్ఘాతాలు ఆశ్రయించి స్తుతించి వ్రాయించినవో కావో నాకు తెలియల్దు. వారే కారణం చేత వ్రాసినా వారు వ్రాసిన వ్రాతలకు నేను బాధ్యుణ్ణి గాను. పర్వాదేశాలకుల్ సర్వకాలాలకు అన్వయించే సత్యాలతో గర్భితమైన భారతీయ సాహిత్య విచారణలందు విశదపరచి నా నిర్ణయాలను తెలిపినాను. అవి అసత్యమని యెవరైనా వాదిస్తే వాటికి సమాధానం వుంటే చెప్పుతాను; లేదా నా మాటలు అసత్యమని ఒప్పుకొని వారి వాక్యాలను వినయంతో శిరసావహిస్తాను. అని మాత్రం మనవి చేస్తున్నాను.

అని శ్రీ.. ఉమాకాన్త విద్యాశేఖర కృతిలో వాజ్మయ సూత్ర

           పరిశిష్డంలో ఉపోద్ఘాతాదికణం సమాప్తం