పుట:Neti-Kalapu-Kavitvam.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతాధికరణం

247


సమాధానం

తెలుపుతున్నాను; పూర్వపక్షానికి తటస్థాక్షేపానికి కలిపి ప్రతివచనం చెప్పుతాను. కృతికర్తలందరు ఉపోద్ఘాతకర్తలను ఆశ్రయించారో లేదో పొగిడినారో లేదో చెప్పలేదు. చాలామంది కృతికర్తలు ఉపోద్ఘాతకర్తలను ఆశ్రయించడం నేనెరుగుదును. కొన్ని సంవత్సరాల క్రిందట ఒక కృతికర్త పీఠిక వ్రాయమని నన్ను ప్రార్థించి చాలా పర్యాయాలు నన్ను కలుసుకొని నాకు పుస్తకం యిచ్చాడు. నేను మీకు పనికి వచ్చే పీఠిక వ్రాయలేనని ఆ పుస్తకం చదివి చెప్పినాను. తరువాత కొన్నాళ్లకు ఆ పుస్తకం ఒక ప్రసిద్ధుడి ఉపోద్ఘాతంతో ప్రశంసలతో బయటికి వచ్చింది. ఒక పెద్ద పద్య గ్రంథాన్ని ఆంధ్రీకరించిన పండితుడు ఉపోద్ఘాతం వ్రాయమని నన్ను కోరినాడు. నేను గుణదోష విచారణలు రెండూ చేస్తాను మీ పుస్తకం పంపండి అన్నాను. నాకా పుస్తకం ఆయన పంపలేదు.

నాతో అదివరకు పరిచయం లేని మరివొకరు మా యింటికి వచ్చి అచ్చుపడని తన పుస్తకాన్ని గురించి కొన్ని పంక్తులు వ్రాసియియ్యమని కోరినాడు. తన పుస్తకంలో కొంత వినిపించాడు. ఆ పుస్తకం యొక్క అనావశ్యకత, అనౌచిత్యం, తెలపగా ఆయన ఉపోద్ఘాత విషయకమైన తన కోరికను ఉపసంహరించుకొని పోయినాడు.

ఈ మధ్య కొందరు కృతికర్తలు తన పుస్తకాలను అట్టలు కట్టని వాటిని పంపి ముద్రాలయంలో నుండి యింకా బైటికి రాలేదు. మీ పీఠిక వచ్చేదాకా అట్టకట్టించకుండా వుంటాము. కనుక సాధ్యమైనంత త్వరలో వ్రాసి పంపవలెనని కోరినారు.

"నాపీఠిక మీ ఉద్దేశాలను అనుసరించి వుడవను కొంటాను. కావలెనంటే వ్రాసి పంపుతాను. నాకు వ్యవధి కావలెను." అని ప్రతివచనం వ్రాశాను. వారు మళ్ళీ ఉపోద్ఘాత ప్రస్తావనతో