పుట:Neti-Kalapu-Kavitvam.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం

దయాధికరణం

పూర్వపక్షం

ఈయెంకిపాటలవంటివి యెంకయ్యచంద్రమ్మపాటలవంటివి కాపుల మీద మనకు దయకల్గించడానికి పనికి వస్తవి గనుక గ్రాహ్యమంటారా? అది సరిగాదు. ఈకాలంలో విదేశీయసంస్కారం క్రింద అణిగి దుర్దశలో వున్న మనమీదనే కాపులు సానుభూతి చూపవలిసి వున్నారు. వారు మన కంటె యేవిధంగాను శోచ్యదశలోలేరు. ఒకవేళ మీరన్నట్లు సానుభూతికలిగించడం వుద్దేశమైతే పశుకామాన్నే ఆధారంగా చేయవలసిన అవశ్యకత లేదు. సంసారపుచరిత్రలను ముడికామం వదలి తక్కిన అనేకమార్గాల చిత్రించవచ్చును. కామంమాత్ర మెందుకు స్వీకార్యంగాదు అని అంటారా? అది ధర్మశబళితం కానప్పటి దుష్ఫలాలిదివరకే విశదీకరించాను. కనుకనే దాన్ని చిల్లరశృంగారమని క్షుద్రకోటిలో చేర్చాను. కరుణాదులను స్వీకరించి వారికథలు చిత్రించవచ్చును. వారిగార్హ్యస్థ్య సంబంధమైన కథలు మొదలైనవి వ్రాయవచ్చును. వాటిలో ఈకాలపు సంఘచరిత్ర ఇమిడివుంటుంది గనుక గ్రాహ్యంగానే వుంటవి వాటి నప్పుడు చరిత్రకథలనిగాని మరివొకమాదిరి రచనలనిగాని అనుకుంటాము వాటిలో ప్రధానంగా రసభావాలను అన్వేషించము కావ్యమని వ్రాసినపుడు గద్యంగానీ పద్యంగానీ దాంట్లో ప్రధానంగా రసభావాలు ఆవశ్యకమవుతున్నవి. అప్పుడు శృంగారం హీననాయకమాయెనా క్షుద్రమవుతున్నది. కావ్యమార్గం వదలి మరేమాదిరి