పుట:Neti-Kalapu-Kavitvam.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

228

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


"అవే యీవిరువన్మయూరాలైన గిరులు, అవే యీ
 మత్తహరిణాలైన వనస్థలాలు, అవే యీ ఆమంజు
 వంజుళలతలై నీరంధ్రనీపనిచుళాలైన సరిత్తటాలు"

"ఆపర్ణశాలలవద్ద గోదావరీపయస్సులో వితతమైన
 శ్యామలతరులక్ష్మితో వానాంతం రమ్యంగావున్నది"
"ఇక్కడనే ఆపంచవటి అయ్యో; వదలిపెట్టి పోతున్నా
 పంచ వటీస్నేహం బలవంతానవలె లాగుతున్నది" (ఉ.రా)

అన్న విశిష్ఠభావాల ఉన్మీలనానికి అవకాశం కలిగింది. ఇక కాపు కన్నెలు ఆవులమందలు జొన్నకంకులు మనోహరంగానా అంటే చెప్పుతున్నాను; బ్రాహ్మణుల యజ్ఞశాల లెందుకు మనోహరంగావు? వివిధమైన చిత్రపదార్థాలతో వుంటే కోమటిదుకాణా లెందుకు వర్ణించరాదు. కాపుకావ్యం, గొల్లకావ్యం, బ్రాహ్మణకావ్యం, కోమటికా,వ్యం యెందు కుండరాదు? పోనీయండి? జొన్నచేలు కంకులు స్వభావసిద్ధమైనవి గనుక అన్నిటికంటె మనోహరమైనవంటే ఒప్పుకొంటాను. చాకళ్లు, మంగళ్లు, బోయలు, అన్ని తెగలవారూ వ్యవసాయం చేసుకొని జీవించేవా రెందరో వున్నారు. కాపులు రెడ్లు వ్యవసాయంమాని రాజసేవచేసేవాం డ్లెందరో వున్నారు. అదిగాక తెనాలితాలూకాలొ యెందరో కమ్మవారు పౌరోహిత్యంగూడా చేస్తున్నారని విన్నాను. ఇట్లాటి సందర్భంలో చేలసౌందర్యంతో కాపుకన్నెలను కాపుబావలనే కలవడం అర్థంలేనిపని. బ్రాహ్మణకన్యలు మంగలికన్యలు, కోమటికన్యలు చాకలికన్యలు రెడ్దికన్యలు అందరూ చేనితో సంబంధించివున్నారు. సంబంధించకవున్నారు. కనుక ఒక కాపుకన్నెలు చేలూ అంటే ఆమాట తోసివేస్తున్నాను.

చేలతో కాపుకన్నెలను కాపుబావలను మాత్రమే కలపడం అక్రమం. కులవాచిత్వం లేకుండా పాశ్చాత్యదేశాల్లో చేలపనిచేసేవాండ్ల కందరికీ అన్వయించే Peasant వంటిదిగాదు. కాపుశబ్దం. Peasants