పుట:Neti-Kalapu-Kavitvam.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వనకావ్యాధికరణం

227


తమ కవిత్వానికి ఆలవాలంచేశారు. తైత్తిరీయా రణ్యకం బృహదారణ్యకం అని ఈతీరున విజ్ఞానానికి సయితం అరణ్య సంబంధం బారతీయ సంప్రదాయం వినిపిస్తున్నది. భారతవర్షాన్ని పవిత్రం జేసిన నైమిశారణ్యం ప్రసిద్దమైనది. వాల్మీకి కవితకు మూడుపాళ్లు అరణ్యమే సీమ. కాళిదాసు కుమారసంభవాన్ని కొండలు, అడవులు వీటి వర్ణనతో ఆరంభిస్తాడు. మహోదాత్తనాయిక అయిన గౌరి కొండకన్నె ఆమెప్రేమ కొండల్లోనే పవిత్రమవుతుంది. శాకుంతలాన్ని కవి అరణ్యంతో ఆరంభించి అరణ్యంలోనే అంతం చేస్తాడు. రఘువంశంవంటి రాజుల చరిత్రలోగూడా కవి ఆదియందు కథ కల్పించి వనసీమలను వశిష్ఠాశ్రమాన్ని నిల్పుకొనితన కవితకు అమృతత్వం కలిగిస్తాడు. యక్షుడికథ కొండల్లో, ఛాయాతరువుల్లో ఆరంభమవుతుంది. విక్రమోర్వశీయ మాళవికాగ్ని మిత్రాలు. కాళిదాసుడి వనప్రకృతిప్రేమను స్ఫుటంగా వ్యక్తపరుస్తున్నవి. ఇంతకూ చెప్పదలచిందేమంటే అడవులను ప్రకృతిని ప్రేమించడానికి క్షుద్రపాత్రలకూసంబంధం అవినాభావరూపమైనదిగాదని. ఉదాత్తనాయకులతోనే భారతీయులు వనప్రకృతిని ఆరధించారు. అదిగాక పరిణతచిత్తులైన ఉదాత్తనాయకులు వనప్రకృతిశోభను ఆస్వాదించే విధం చిల్లరమనుషుల విదానానికంటే భిన్నమైనది. వనప్రకృతిశొభను ఆస్వాదించే విధం చిల్లరమనుషుల విధానానికంటె భిన్నమైనది. వనప్రకృతిశోభలు హృదయాన్ని అధిష్ఠించిన ఉత్తమ నాయకులు కావ్యాన్ని పావనంచేయ బట్టే సీతను ఆడవికిపంపిన పిమ్మట రాముడు దండకలో ప్రవేశించిన సందర్భంలో

"దండకారణ్యమా? ఇది" "ఒకచోట స్నిగ్ధశ్యామా
 లై ఒక చోట భీషణాభోగరూక్షాలై ప్రతిస్థలంలో
 ఝూత్కృతులచేత ఘోషిల్లేదిక్కులు గలిగి అగస్త్యా
 శ్రమ పరిద్గర్తకాంతారమిశ్రాలై పరిచితభూములైన
 దండకారణ్యభాగా లివిగో కనబడుతున్నవి"

"అరణ్యకులకు గృహులము స్వధర్మరతులము అయి
 జన్మఫలభూతవిషయాల్లో రసజ్ఞులమైన మేము వెనక
 నివసిస్తుండిన యీవనమహో! యీనా డెట్లాదృష్టమైనది!"