పుట:Neti-Kalapu-Kavitvam.pdf/261

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


శ్రీగ ణే శా య న మ:

వాజ్మయపరిశిష్టభాష్యంబొద్దు పాఠ్యం

వనకావ్యాధికరణం

పూర్చపక్షంవాలు పాఠ్యం

   అవునయ్యా పోనీయండి క్షుద్రంగానియ్యండి అనౌచిత్యం వుండనీయండి ఇంగిలీషులో (Pastoral Poetry) పాస్టరల్ పొయట్రీ అని వున్నది. అది చాలాగొప్పది. గొల్లలు మొదలైన పాత్రలుంటారు. ఆవులు, లోయలు మొదలైనస్ధలాలు అందులో వర్జితమవుతవి ఈ యెంకిపాటలు మొదలైనచి అట్లాటిచ్వి కనుక మంచివి. చేలు, కాఉలు కాపుకన్నెలు మన ఆంద్రదేశంలో మనోహరమైన అమాయికజీవితాన్ని ప్రదర్శిస్తున్నారు. జొన్నచేలు, కంకులు మంచెలు కాపుకన్నెలవలపులు, విలాసాలు యెవరిని ఆకర్షించవు? ఇది (Pastoral Poetry) పాస్టరలు పొయెట్రీ కనుక మంచిదంటారా!

సిద్దాంతం

  అది అసంబద్ధం అని మచివిగాదని చిల్లరశృంగారం ప్రధానంగా అనుపాదేయ మని తెలిపినాను. పాస్టరులు పొయట్రీ అనే పేరు తిరిగి వినిపించినమాత్రాన వీటి క్షుద్రత్వం యెట్లాపోతుంది? అయినా దీన్ని గురిమి వివరిస్తాను. అడవులు లోయలు మనోహరాలన్న మాట నేను తిరస్కరించను. మనుష్యులు రజస్తమస్సుల ప్రవృత్తిచే దూషితమై సంకీర్ణమైన పట్టణాలకంటె ప్రశాంత నిర్మలాలైన ప్రకృతి రమణీయమైన అడవులు వాస్తవంగా కవికి ఆరాధ్య్సాలు అందుకే వాల్మీకి కాళిదాసు భవభూతివంటి కవులు పట్టణాలను దూరాన వదలి అరణ్యసీమలనే