పుట:Neti-Kalapu-Kavitvam.pdf/260

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
225
తత్త్వార్థాధికరణం


అంటింతచెట్లతో తంటాలుపడలేమేమిటి? తోలుచెప్పులు కుట్టినానే చంద్రమ్మ యేమిటి? ఆకుమళ్లకు నీవు రావేచంద్రమ్మ యేమిటి? కొడుకుకోసం మొక్కుకోవే చంద్రమ్మ యేమిటి? వొంటాముదము దెచ్చి వుడికించి నీకాలు సరిచేసి దరిమేనురారోరెంకయ్య యేమిటి? అప్పు డీపాటలన్నీ అర్ధహినాలై అయోమయంలో బడతవి. చిల్లర శృంగారం తప్పించబోతే అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్లు అయోమయత్వం అపతితమవుతుంది. అయోమయత్వాదికరణంలో ఈదోషాన్ని వివరించాను. పాటలకర్తల వేదాంతప్రవృత్తి యెట్లావున్నా యిట్లాటిపాటలు పాడేవారు తమపశుకామప్రవృత్తులకు అనుకూలంగా వీటిని పాడడం విశదమైన సంగతి కాదు కూడదు. వీట్లో వున్నది వేదాంతమేనంటే చెప్పుతున్నాను. వేదాంతమని గట్టిగా చెప్పితే నాకిప్పుడు విచారణే లేదంటాను. కావ్యమని శృంగారమని కవిత్వమని అన్నప్పుడే నాకు కావ్యవిచారణ యిక్కడ ప్రసక్తిస్తుంది. అప్పు డిది చిల్లరశృంగారమని క్షుద్రశృంగారమని నిర్ణయించాను. వేదాంత మంటారా? అసంబద్ధపుమాట లాడి యివి వేదాంతమనడం తప్పించుకునే తేలికవుపాయమంటాను. లేదా మరియొక సందర్భంలో వేదాంతవిమర్శ చేసేటప్పుడు దీంట్లో వేదాంతమేమిటి ? ఈవేదాంతం కొత్తదంటారా? కొత్తదయితే యెంతవరకు అసంబద్దత లేకుండావున్నది? భక్తిమతంలో జీవేశ్వరుల రమణీవల్లభ సంబంధం యెంతవరకు ఉచితం? అది యిక్కడయెట్లా విని యుక్తమైనది? దానివల్ల సంభవించే శ్రేయోనర్ధాలేవి? ఈపాటల మతం కొత్తదైతే యెంతవర కంగీకార్యం? అని వేరే విచారణచేస్తాను. ఇది కావ్యమని, కవిత్వమని, శృంగారమని అన్నప్పుడే నాయీవిచారణ ప్రస్తక్తం చేస్తున్నాను. కావ్యవిచారణ చేసి యివి చిల్లరశృంగార మని క్షుద్రశృంగారమని స్పష్టపరచాను.

అని శ్రీ ఉమాకాన్త విద్యా శేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో తత్త్వార్ధాధికరణం సమాప్తం