224
వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవ్చిత్వం
అని యిట్లాటి భ్రష్ట ప్రామాణికవచనాలు సయితం తలచూపుతున్నవి. అంతా ఒకటేనని నీకూ నాకు భేదంలేదని నీవొళ్ళూ నావొళ్ళూ కలిస్తే అద్వైతమవుతుందని దుష్టకార్యాలందు ప్రవృత్తిసయితం పైమాదిరి వేదాంత దుర్వినియోగంవల్ల తటస్థిస్తున్నదై. శ్రీబాగవతంవంటి గ్రంధమే ఆ మార్గాలకు అనేకుల కాధారమైనప్పుడు తక్కిన క్షుద్రాలసంగతి చెప్పవలసినపనిలేదు కృతికర్త ప్రవృత్తినిబట్టి కృతిత్వం నిర్ణయించడం ఉచితం.
కృతికర్తలు ఆదరణచేత విరాగులుగా వానప్రస్ధులుగా తత్వజ్ఞానులుగా వుంటూ యేదైనా పాటపాడి దానికి వేదాంతార్ధమంటే వొప్పుకొంటాము యెందుకంటే వారిచిత్తవృత్తే తత్వజిజ్ఞాస కనుకనె
"సన్నంపుదిడ్డివాకిట పున్నమవెన్నెలబైటా
కెన్నెరరవము వింటినీ"
అని బ్రహ్మగురుకోటిలో వారుపాడితే వ్యంగ్యం అయోమయం పడనంతవరకు యెట్లానో తత్వగ్రఃహణం అంగీకరిస్తాము. అని ఒక కామి యొక్క సొంతమటలైతే మన్మధాలాపాలాడుతున్నా డంటాము. విచార్యమాణమైన యీపాటలకర్తలకు వానప్రస్ధత్వంగాని విరాగిత్వంగాని జనకాదులవంటి తత్వపరాయణమైన ప్రవృత్తిగాని ఉన్నట్లు ప్రసిద్ధి లేదు. కృతికర్తల ప్రవృత్తినిబట్టి యెంకిపాటలు యెంకయ్య చంద్రమ్మ పాట మొదలైనవి వేదాంతమన వీలులేదంటున్నాను. యెంకయ్య చంద్రమ్మ పాట మొదలైనవి వేదాంతమన వీలులేదంటున్నాను. యెంకయ్య చంద్రమ్మపాట కర్తయెవ్వరో తెలియనే తెలియదు.
కృతికర్తల ప్రవృత్తితో మనకేమిపని? చంద్రమ్మపట కర్తయెవ్వరో తెలియదని మీరే అంటున్నారు కృతిలో తత్త్వార్ధముంటే చాలు అని అంటారా? అది వేదాంతమైతే మాతమ్ముణ్ణి మాకియ్య రయ్యోయేమిటి? కోడికూసేసరికి కొంపకెల్లాలి యేమిటి? తోతకునీళ్ళు చల్లడమేంది?కులకడమేంది? మంచెకింద గొంగడి వేసుకొని తిప్పలుపడడమేంది? పూచలిబియ్యం బెడతరారో వెంకయ్య యేమిటి?