పుట:Neti-Kalapu-Kavitvam.pdf/255

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


220

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

భంగమయి గోరుచుట్టుమీద రోకలిపోటన్నట్లు క్షుద్రత్వాఅనికి అనౌచిత్యం చేరిందని విశదీకరించాను. ఇట్లానే వెంకయ్య చంద్రమ్మ పాటలోను

    "యెందులో జూచినా యెలుతురుండాదంట
    యెరిగితేసూపిచిపోరో వెంకయ్య
    లేకుంటె నిన్నిడువలేద యెంకయ్యకి
    సప్తసముద్రాల్లో సారముంటదంట
    తెచ్చి పె/దుతువుగానిరారో రెంకయ్య॥
    తెలిసందమామలొ తియ్యపానకముంది
    తెచ్చిపెడుదువుగాని రారో వెంకయ్య
    లేకుంటె నిన్నిడువలేరా యెంకయ్య॥
అనేవి అనౌచిత్య ప్రతిపాదకాలని తెలుసుకోవలెను. ఇక
   "శిరసునామీదేసి సిరునవ్వునవ్వితే
   సింతలన్నీ మరిసినావే చంద్రమ్మ"
                                     (యెంకయ్య చంద్రమ్మపాట)
   యెంకిగాలొక సారి యిసిరివాసాలు
   తోటంతరాజల్లె తొవ్విపోసెను." (యెంకిపాటలు)
   "నీనీడలోపలా దేవుడుండాడంట
      నానీడలోగలిసిపోరా వెంకయ్య" (యెంకయ్య చంద్రమ్మ)
   "నీనీడలోనే మేడకడత నాయుడుబావా" (యెంకిపాట)
   నీవొళ్లు నావొళ్లు నిజముగానొకటైతి
   పైనసుక్కలు నవ్వినాయే చంద్రమ్మ
   పాపచంద్రుడు నవ్వినాడే చంద్రమ్మ
                                    (యెంకయ్య చంద్రమ్మపాట)
   "సెంద్ర వొంకలో యేమి సిత్రమున్నాదే
    వొంకపోగాని మావొస్తడమ్మా (యెంకిపాట)