పుట:Neti-Kalapu-Kavitvam.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనౌచిత్యాధికరణం

219


ఉపనిబద్ధుడైనంతమటుకే మనకు విచార్యంగాని తక్కిన అతనిఒడ్డు పొడుగు, అతిడిచుట్టలపొగ, అతడిచెప్పుల కిర్రు, అతడిజిత్తులు మాట్లాడవలె నని మాట్లాడడం ఇవన్నీ విచారించడం అప్రమత్తం. అయినా మీరన్నట్లు అతడు సంస్కారవంతుడైనా, ప్రాకృతుడివలె నటించాడని ఒప్పుకొని విచారించినా నాకు విప్రపత్తిలేదు. నాకు కావలసినది కావ్యంలో వున్నమటుకే గనుకను, నేను కావ్యవిచారణమటుకే చేస్తున్నాను గనుకను, కావ్యంలోమటుకు అతడు సంస్కారంలేని మోటువాడనే స్పష్టం గనుకను అతడు అపరిణతుడనే అంటున్నాను. కావ్యానికి ఔచిత్యం ఆయువుపట్టు వంటిదని అదిలేకుంటే అనౌచిత్యం సంభవించి రసభంగహెతువవుతుందని వివరించాను. యేతర్కంచేతనైనా అతడు పరిణతుడనే ఒప్పుకొంటే కావ్యమంతా అనౌచిత్యం పాలౌతుంది సర్వానౌచిత్యంకంటే యేకదేశానౌచిత్యమేకావ్యకర్తలకు అనుకూలంగదా. అస లింతకు ప్రాకృతుడని నిరూపించాను. సాధారణంగా అంతటా అపరిణతమైన శబ్దార్థాలు వెలువరించిన కృతిలో

"పెక్కునీవులునాకు,
 మాటలో మనసులో మంచిలో యెంకి
 సొగసునీవోసారె అగపడవనాకూ"

అనే యిట్లాటివి అనౌచిత్యాన్ని ఆపాదిస్తున్నదని తెలుపుతున్నాను.

"ఏకోహిదోషో గుణసన్నిపాతే
 నిమజ్జతీందోః కిరణేష్వివాంకః" (కుమార)

అని కాళిదా సన్నట్లు ఈఅనౌచిత్యదోషం ఉపేక్షించవచ్చునంటే వీలులేదు. కావ్యమంతా చిల్లరశృంగారంతో క్షుద్రంగా వున్నపుడు గుణసన్నిపాత మెక్కడిది? ఆక్షుద్రత్వానికి ఈఅనౌచిత్యం తోడ్పడుతున్నది చిల్లరశృంగారంవల్ల ఆపతితమయ్యే క్షుద్రత్వ మిదివరకే నిరూపించాను. కావ్యానికి ఔచిత్యం ఆయువుపట్టని అదిలేకుంటే అనౌచిత్యం సంభవించి రసభంగ హేతువౌతుం దని తెలిపినాను. యెంకిపాటల్లో ఔచిత్యం ఇట్లా