పుట:Neti-Kalapu-Kavitvam.pdf/253

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


218

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

సిద్ధాంతం

వివరిస్తున్నాను; యెంకితోమాట్లాడే సందర్బం గనుక యెంకిబావ మాట్లాడినాడని నాయుడు సంస్కారవంతుడే నని అంటే ఒప్పుకోము యెంకితో మాట్లాడని యేకాంతసందర్బాల్లోగూడ అత డీభాషనే మాట్లాడినాడు. అక్కదిమాటల రూపమేగాక అభిప్రాయం గూడా సంస్కారహీనుడైన మోటువాండ్ల అభిప్రాయదశను దాట జాలలేదు.

     "యాడుంటివె యాడుంటివే
     పూతొరిపందిట్లో సీతాయెల్తుంటె
    నీతశుకుగేపకాన నాతలతిరిగిందొలె
    మెళ్లోపూసలపేరు తల్లోపూవులపేరు
    కళ్లెత్తితేసలు కనకాభిషేకాలు"

అనిమొదలయిన చదువుకోనివాండ్ల శబ్దార్ధాలనే వ్యక్తప్రుస్తాడు గనుక చచువురాని మోటువాడంటున్నాను.

పూర్వపక్షం

అవునయ్యా అట్లా మాట్లాడవలె నని మాట్లాడినాడు అంతే గాని అతడు పరిణతుడేనంటారా?

సిద్ధాంతం

చెపుతున్నాక్వ్ను అతడు ఆతీరున కృత్రిమంగామాట్లాడినాడని కవి యెక్కడాతెలుపలేదు. అయినా నాయకుడు కావ్యంలో