పుట:Neti-Kalapu-Kavitvam.pdf/252

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


217

అనౌచిత్యాధికరణం

అనౌచిత్యం పాలైందంటున్నాను. కనుక అనౌచిత్యంతప్పని చదువుతున్నదని చెప్పుతున్నాను.

పూర్వపక్షం

అవునయ్యా కవివిషయం మాకావశ్యకంగాదు. ప్రకృతివైపరీత్యం గాని, విరోధంగాని యిక్కడలేదు. కవి ఔచిత్యాన్ని ప్రదర్శించాడు దాన్ని తెలుపుతున్నాము. నాయుడు సంస్కారవంతుడే అయినా యెంకిచదువువల్ల గలిగే సంస్కారంలెని మోటమనిషి యెంకితో కలుస్తున్నాడు గనుక యెంకిబావ మాట్లాడుతున్నాడు ఇందులో యెంకే ప్రధానం అందుకే యెంకిపాటలని దీనికి పేరు పెట్టినారు. దీంట్లోది యెంకిభాషగాని నాయుదిభాషగాదు. హనుమంతు డిట్లానే రామలక్ష్మణులతో సంస్కృతం మాట్లాడుతాడు కాని హనుమంతుడిభాష సంస్కృతంగాదుగదా నాటకాల్లో సయితం కార్యసందర్బాన్ని అనుసరించి యీతీరున భాషావ్యతిక్రమం జరగడం కద్దు అందుకే

(కార్యసందర్బాన్ని అనుసరించి ఉత్తమాదులను సయితం భాషా వ్యతిక్రమం చేయవలసివుంటుంది) అని దశరూపకర్త అంటున్నాడు దీన్నే సాహిత్య దర్బనకర్త ఉదాహరించిన ఘట్టంలో వ్యాఖ్యాత

"ఉత్తమస్య రాజాంత;పురదారిత్వే మాగధీ"

అని ఉత్తములకు కొన్నిచోట్ల ప్రాకృతభాషను వాడవలెనని అభిఒరాయం తెలిపినాడు. యెంకితొకూడేసందర్బం గనుక నాయుడు మాట్లాడినాడు కనుక అది నాయుడిభాషగాదు. అందువల్ల

"సెందురుణ్ణి కూకుండనీడు రామకుష్ణ"

అని యిట్లాటి మాటలు మాటలాడినాడన్న మాత్రాన అతడు చదువురాని సంస్కారహీనుదు డవడానికి వీలులేదు అని అంటారా?