పుట:Neti-Kalapu-Kavitvam.pdf/251

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


216

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

ఆక్షెపం

అవునయ్యా: యెంకమ్మ చంద్రమ్మపాటలలోవలె కవిదే ఆభాష అంటాము అప్పుడు పాత్రల నిత్యవ్యవహార భాష అనేవాదం పోతుంది గదా పాత్రలది ఆబాష కాకపోవచ్చును కవి తనభాషను పాత్రలకు అరోపిస్తున్నాడు. కనుక పాత్రలు అపరిణుతు లనడం నిల్వదు అని అంటారా?

సమాధానం

చెబుతున్నాను. కవిది ఆబాష అయితే అది అతడి నిత్యవ్యవహారభాష అంటారా? అప్పు డతడు అది నిత్యవ్యవహారభాష అయిన అపరిణతవలయంలో చేరుతున్నాడు. ప్రకృతివైపరీత్యంవల్ల అనుచితమైన భావాలు ప్రక్షిస్తా లనవలసివస్తుంది. ఇక అపరిణితుడైన కవికి పరిణతనాయకసృష్టి అసంభవం గనుక నాకు విప్రపత్తి లేదంటున్నాను. అతడు అసాధారణుడు, కనుక ఆబషలోనే పరిణతభావాలు అతిడికి ఉత్పన్నమైనదంటారా? దేశకాలప్రకృతులతో సంబద్ధంకాని అసాధారణత్వం ఔచిత్యవిచారణ నుండే దూరమవుతున్నదని చెప్పుతున్నాను. కనుక యిక్కడ అట్లాటి దాని విచారణేలేద్సు. అవునయ్యా ప్రకృతిచేత ఉచితుడు అయినా అతడు ఆభావనను కావ్యంలో వాడవలెనని సమయమేర్పరుచుకొన్నాడా వ్రాస్తాడు. అది అతడి సామయికభాష దాంట్లోనే రామాయణాదులుకూడా వ్రాస్తాడుయ్. అని అంటారా? అది ప్రత్యక్షవిరోధం గనుక అనౌచిత్యమంటున్నాను. అపరిణతనాయకులకు పరిణత శబ్దార్ధాలు ప్రవృత్తి తగిలించడంవలె పరిణత నాయకులకు పరిణత శబ్దాలు ప్రవృత్తి తగిలించడం ప్రత్యక్షవిరోధం గనుక ఘట్టకుటీప్రభాత న్యాయంచేత అనౌచిత్యమే యెదుర్కొంటున్నది. పరిపాకవత్త్రభవత్వరూపమైన శబ్దార్దపరిణతి నెవరు వారించగలరు? పాత్రలకు తగిలించకుండా కవేఆబాషలోసామయికంగా పరిణత భావాలు ప్రదర్శించినప్పుడే మంటారంటే కవియొక్క ఆసమయమే